У нас вы можете посмотреть бесплатно ముమ్మిడివరం బాలయోగి సమాధి దేవాలయ చరిత్ర | Balayogi Temple Mummidivaram | East Godavari или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బాలయోగి టెంపుల్ (సమాధి) ముమ్మిడివరం “ముమ్మిడివరం బాలయోగి సమాధి దేవాలయ చరిత్ర | Balayogi Temple Mummidivaram | East Godavari” ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో ముమ్మిడివరం వద్ద ఉన్న బాలయోగి సమాధి దేవస్థానం, భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతోంది. చిన్న వయస్సులోనే గాఢమైన ధ్యానం, యోగ సాధన ద్వారా “బాలయోగి”గా ప్రసిద్ధి చెందిన యోగి సమాధి ఇక్కడే ఉంది. ఈ వీడియోలో ముమ్మిడివరం Balayogi Temple / Samadhi స్థలం గురించి తెలుగులో తెలుసుకుందాం 🙏 ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు: ✅ ముమ్మిడివరం బాలయోగి ఎవరు? వారి జీవితం గురించి సంక్షిప్తంగా ✅ Balayogi Samadhi ఎక్కడ ఉంది? (Mummidivaram – East Godavari) ✅ ముమ్మిడివరం బాలయోగి సమాధి దేవస్థానం విశేషాలు ✅ ఆలయం / సమాధి వద్ద జరిగే పూజలు, జయంతి, ప్రత్యేక కార్యక్రమాలు ✅ భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తారు? వారి విశ్వాసాలు, అనుభవాలు ✅ Mummidivaram Balayogi Temple కి ఎలా వెళ్లాలి? (basic route / nearby town info – మీరు వీడియోలో చెప్పినట్టు) ఈ వీడియో ద్వారా ముమ్మిడివరం బాలయోగి సమాధి స్థలం, దేవస్థానం విశేషాలు, భక్తుల భక్తి గురించి సులభమైన తెలుగులో మీకు అందిస్తున్నాం. 👉 వీడియో నచ్చితే LIKE చేయండి 👉 మరిన్ని Temples, Samadhi Sthalalu & Devotional Travel videos in Telugu కోసం SUBSCRIBE చేయండి 👉 మీ friends & family, East Godavari / Konaseema భక్తులతో SHARE చేయండి Mummidivaram Balayogi Maharaj ki Namaskaram 🙏 #BalayogiTemple #Mummidivaram #BalayogiSamadhi #EastGodavari #KonaseemaTemples #TeluguDevotional #TempleVisit #SamadhiSthalam #TeluguBhakti #AndhraPradeshTemples balayogi temple mummidivaram, mummidivaram balayogi samadhi, balayogi temple history in telugu, mummidivaram temple in telugu, east godavari temples in telugu, konaseema temples in telugu, balayogi maharaj story telugu, devotional travel videos in telugu, temple history in telugu, andhra pradesh temples in telugu, mummidivaram balayogi full details in telugu #balayogitemple ll #mummidivaram #mummidivarambalayogi temple #balayogitemplemummidivaram #mummidivarambalayogitemple #mummidivaram #balayogitemple 🌹🙏🙏,ముమ్మిడివరం బాలయోగి టెంపుల్,బాలయోగి సమాధి రుషులు ఏ అరణ్యాల్లోనో ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటారని చెప్పే కావ్యాలు, తెలుగు వాచకాల మధ్య సరిగ్గా 82 ఏళ్ల క్రితం ఒక సామాన్యుడు రుషియై జనావాసాల మధ్య తపస్సు చేశాడు. యోగమూ తపస్సూ ఉత్త ట్రాష్ అనుకునే అత్యాధునిక సాంకేతిక యుగంలో తన కఠోర తపోదీక్షతో యోగశక్తిని చాటి చూపించాడో మౌని. అయితే ఆయన ఏనాడూ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయలేదు, ప్రవచనాలనూ చెప్పలేదు. ఆయన బాలయోగి. ఊరు పేరుతో ఈశ్వరత్వాన్ని జోడించుకున్న ముమ్మిడివరం బాలయోగీశ్వరులు. 1930 అక్టోబర్ 23న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో ఒక పేద మాల కుటుంబంలో కటికదల గంగయ్య రామమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు సుబ్బారావు. వంశపారం పర్యంగా వచ్చే గోపాలక వృత్తిలో సుబ్బారావు అయిష్టంగానే చేరాడు. చదువుకునే అదృష్టం ఎటూ లేదు. ఎరుకనిచ్చే చదువు వేరే ఉందని గ్రహించిన సుబ్బారావు తన 16వ ఏట 1946 మే 22న కృష్ణుడు నారదుల ఫోటోతో సమీపంలోని కొబ్బరితోటలోకి వెళ్ళి తపస్సుకు కూర్చున్నాడు. తల్లిదండ్రులు వారించి తీసుకొచ్చారు. ఇంటిదగ్గరా అదే బాట. ఇక లాభం లేదనుకుని ఇంటి ప్రాంగణంలోనే కొబ్బరాకులతో పందిరి కట్టారు. పదహారేళ్ల ప్రాయం వాడు కఠోర తపస్సా అని ఆనోట ఈనోట పాకి భక్తజనం పోటెత్తారు. ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ఊరు ఒక ముక్తిథామం అయిపోయింది. అలా రెండు సంవత్సరాల 8 నెలలు ఆయన కనువిప్పి లోకాన్ని చూసిందీ లేదు, పెదవి విప్పి సంభాషించిందీ లేదు. అందుబాటులో ఉన్న దేవుడని అందరూ పాదాల్ని స్మృశించి, చుట్టూ గుమ్మిగూడుతుంటే తపస్సుకు ఇది మార్గం కాదనుకుని ఆయన లోలోపలి గదుల్లోకి వెళ్లిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న మహర్షి ఈలి వాడపల్లి ఆయన్ని దర్శించి ఇతను బాలయోగి అన్నారు. అప్పటి వరకూ ప్రతిరోజూ దర్శనం ఇచ్చే బాలయోగి ఇక మీదట వద్దన్నారు. భక్తులు, నిర్వాహకులు కోరితే 16-2-1950 నాటి నుంచి మహాశివరాత్రి మరుసటి రోజు దర్శనానికి అనుగ్రహించారు. అప్పటి నుంచి తన అవతార పరిసమాప్తి అయిన 19.7.1985 వరకు బాలయోగి భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలోనే ఆయన తనేమిటో తన తపోశక్తి ఏమిటో అనేక నిదర్శనాల ద్వారా తెలియజేశారు. అదలా ఉంచితే ఎవరైనా ఒక వ్యక్తి 40 ఏళ్ళపాటు నిరాహారంగా, స్వీకార విసర్జనలు లేకుండా వుండటం సాధ్యమా అని ప్రశ్నలు లేవనెత్తిన తరుణంలో బాలయోగి దానికి తార్కాణంగా నిలిచారు. సంప్రదాయమైన యోగవిద్యను వశపరచుకున్న బాలయోగి అష్టాంగ యోగం ద్వారా సమాధిలోకి వెళ్ళిపోయి ఆకలి దప్పులను విసర్జించారు. భారతీయ యోగ సంప్రదాయంలో ఆపాద మస్తకము విస్తరించిన కుండలినీ శక్తిని జాగృతం చేసి, వెన్నువెన్నంటి నడిచే శుషమ్నా నాడిద్వారా ప్రయాణించి ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మునిపుర, స్వాథిస్థాన, మూలాధార చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరడాన్ని జీవైక్యంగా ప్రతిపాదించారు. బాలయోగి దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఇంతచేసి బాలయోగి మాట్లాడకపోలేదు. అదికూడా యోగంలో ఉన్న ఒకటి రెండు సందర్భాల్లోనే. చివరికి ఆయన భక్తులు చెప్పమంటే ఆయన చెప్పింది ఇది.... "భగవంతుని ధ్యానించడానికి అరణ్యం వెళ్ళనవసరం లేదు.