У нас вы можете посмотреть бесплатно Remembering Great Leader kondapalli Seetharamaiah On His Death Anniversary || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
మార్పు కోసం ఉదయించిన విప్లవ సూర్యుడు.... జన చైతన్యమే జీవితాశయంగా పని చేసిన నిత్య శ్రామికుడు. మానవ సమానత్వం కోసం పోరాటాలు చేసిన అలుపెరుగని కార్మికుడు. ఆయన వ్యక్తిగా,ఉద్యమకారుడిగా, కష్టశీలిగా రాష్ట్రాలు దేశాల సరిహద్దుల చట్రాల మధ్య ఇమడని విశ్వ మానవుడు... ఆయనే కొండపల్లి సీతారామయ్య. పశ్చిమ బెంగాల్ లో పురుడు పోసుకున్న నక్సల్ బరి ఉద్యమాన్ని శ్రీకాకుళం వేదికగా తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చి దానికి నాయకత్వం వహించిన ఉద్యమ వీరుడు. అప్పటి వరకు ఉన్న ప్రజా పోరాటాలను కలుపుకొని నక్సల్ బరి... పీపుల్స్ వార్ పార్టీగా రూపాంతరం చెందడానికి కీలక పోషించిన పోరాట యోధుడు. తన పూర్వ అనుభవాన్నంతా రంగరించి పార్టీకి ‘మాస్ లైన్’ అందించటంలో ముఖ్య భూమిక పోషించిన ప్రజా నాయకుడు... కొండపల్లి సీతారామయ్య. వ్యవస్థ మార్పు కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన త్యాగశీలి, మార్గదర్శకుడు కొండపల్లి సీతారామయ్య. సహచరులు, అనుచరులు, అభిమానులు కామ్రేడ్ కేఎస్, ‘పెద్దాయన’ అని గౌరవంగా పిలుచుకునే కొండపల్లి సీతారామయ్య అమరులై నేటికి 16 సంవత్సరాలు. విద్యార్ధి, యువజన, రైతు కూలీ సంఘాలతో పాటు ప్రజా నాట్యమండలి ఒరవడిలోనే జన నాట్యమండలిని పీపుల్స్‌వార్ కి అనుబంధంగా... శక్తివంతమైన సాంస్కృతిక సంస్థగా తీర్చి దిద్దారు. 1970లలోనే ఆయన తయారు చేసిన ‘వ్యవసాయ విప్లవం’ డాక్యుమెంట్‌లో భారత సమాజంలో కింది కులాల రూపంలో ఉన్న పేద శ్రామిక వర్గాన్ని, పై కులాల రూపంలో ఉన్న ధనిక భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలను చూశారు. ఆయన కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో, ఇతర రాష్ట్రాలలోను వ్యవస్థ మార్పుకోసం సాగుతున్న ఉద్యమాలను ప్రభావితం చేసారు. దాదాపు దశాబ్దం పైబడి ఇతర అనారోగ్యాలతో పాటు అల్జీమర్స్ వ్యాధితో పీడించబడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలించారు. అయినా, ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్ధూపాలు లేవు, స్మారకోపన్యాసాలు లేవు. ఓ అన్సంగ్ హిరోగా మిగిలి పోయారు. ఎందుకు!? అల్జీమర్స్ వ్యాధి గురించి మన సమాజానికి, ప్రత్యేకంగా ఉద్యమ శ్రేణులకు సరైన అవగాహన ఉండి వుంటే సీతారామయ్యని కూడా ఆయన సహచరులు కన్న కొడుకుల వలే అంతే అపురూపంగా చూసుకుని ఉండేవారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ మన సమాజంలో ఆ వ్యాధి గురించి, ఆ వ్యాధి సోకిన వారిని ఎలా అర్ధం చేసుకోవాలన్న దాని గురించి ప్రాథమిక అవగాహన కూడా లేదు. మెడికల్ ప్రొఫెషనల్స్ లో కూడా ఆ అవగాహన అంతంత మాత్రమే. వెన్నెముకకి వచ్చిన టీబీ జబ్బు గానీ, హృద్రోగం గానీ, పార్కిన్‌సన్స్ జబ్బు గానీ తన పోరాట స్ఫూర్తిని, దీక్షాదక్షతని ఏమాత్రం ఆటంక పరచలేకపోయాయి. కాని చనిపోయే నాటికి ఒక దశాబ్దం ముందు నుంచే నిశ్శబ్దంగా, దొంగలా ఆయనలో ప్రవేశించిన అల్జీమర్స్ మాత్రం ఆయన్ని తన సహచరులకు దూరం చేసింది.ఉద్యమాలకు గొప్ప దిశా నిర్దేశం చేసిన ఆ మహా నాయకుణ్ణి, ఆలోచనా పరుణ్ణి కొంతకాలం పాటు దశ దిశ తెలియకుండా సంచరించేలా చేసింది. మతిమరుపుతో, మసక బారుతున్న మేధస్సుతో, తగ్గిపోతున్న విశ్లేషణా శక్తితో, ప్రవర్తనలో మార్పులతో ఆయన అంతిమ దశలో చాలా సంవత్సరాలపాటు వెళ్లదీయవలసి వచ్చింది. ఇదంతా మాయదారి అల్జీమర్స్ వల్ల జరుగుతున్నదన్న ఎరుక ఉండి వుంటే ఉద్యమ సహచరుల నుంచి ఆయనకు మరింత సానుభూతితో కూడిన ప్రతిస్పందన ఖచ్చితంగా ఉండి వుండేది. చివరి దశలో ఆయన స్థితికి కారణం అల్జీమర్స్ మహమ్మారి. అటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన విప్లవ స్వప్నాలే కన్నారు. రోగ లక్షణంగా ఆయనకొచ్చిన ఇల్యుజనేషన్స్ లో కూడ విప్లవ సైన్యం కదలికలు, కవాతులే ఉండేవి. విజయవాడ మొగల్రాజపురంలోని ఇంటి పైన టెర్రస్ మీద కూర్చుని ఎదురుగా రోడ్డు పైన వెళ్తున్న జనాన్ని, వాహనాలను చూపిస్తూ రెడ్ ఆర్మీ కవాతుగా భ్రమించేవారు. నిత్యం ఊళ్లు తిరగాలని, పార్టీని పునర్నిర్మాణం చెయ్యాలని తహతహ లాడేవారు. ఆయన్ని చూడటానికి వచ్చిన అందరినీ పార్టీ పని చేయమని ప్రేరేపించేవారు. ఆ తపనను గమనించి ఆయన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి, వెళ్ల కూడని కార్యక్రమాలకు కూడా తీసుకెళ్లి తమ స్వార్థప్రయోజనాలు నెరవేర్చుకున్న వారూ ఉన్నారు. అలా ఆయన పేరు ప్రతిష్టల్ని దుర్వినియోగ పరుస్తున్న వారి వెంట ఆ కార్యక్రమాలకు వెళ్లవద్దని చెబితే నొచ్చుకునేవారు. ఒకరోజు కే ఎస్ మనుమరాలుతో ‘మీ నాన్న దొంగ. పార్టీ పని చేయకుండా డాక్టరయ్యి హాస్పిటల్ నడుపుతున్నాడు’ అన్నారు! ఆయన కోరుకున్నట్లు పార్టీ పని కాకుండా హాస్పిటల్ నడుపుతున్నందుకు ఆయనకు కొడుకు మీద చివరిదాకా కోపంగానే ఉండేది. కొడుకు డా. గంగాధర్‌గా వెళ్తే కోపం. పేరు మార్చుకొని వేరే పేరు చెప్పి వెళ్తే గుర్తు పట్టేవారు కాదు. కోపం వుండేది కాదు. అందుకే వారి వైద్య అవసరాలు తీర్చటానికి ఆయన కొడుకు డా. అశోక్ అని మారు పేరుతో వెళ్ళేవారు. పాత విషయాలు గుర్తున్నంత స్పష్టంగా సమీప గతం, వర్తమానం లోని విషయాలు గుర్తుండేవి కావు. కొత్త జ్ఞాపకాలు రూపుదిద్దు కోకుండా చేయటం, హైయ్యర్ ఇంటలెక్చువల్ ఫుంక్షన్స్ ని దెబ్బ తీయటం అల్జీమర్స్ లక్షణాలు. అందుకే ఆయన చెబుతున్నది అస్పష్ట౦గా వుండేది. డజన్ల కొద్ది anecdotes తో చెప్పే ఆయన ఉద్యమ అనుభవాలను, రిచ్ ఎక్స్పిరిఎన్స్ ను అప్పుడు రికార్డు చెయ్యలేక పోయారు. కానీ ఆయన మాటల్లో పార్టీ పునర్నిర్మాణం, ఉద్యమ కొనసాగింపు చెయ్యాలన్న పట్టుదల మాత్రం స్పష్టంగా ఉండేది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ ఆ రోజుల్లో కేఎస్‌పై ఒక డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నించినా వారి ఆరోగ్య పరిస్థితి వల్ల అది అంత బాగా జరగలేదు. ఈ మతిమరుపు, అస్పష్టత, అసంబద్ధత, కన్ఫ్యూజన్, కొత్త జ్ఞాపకాలు ఏర్పరచుకోలేని స్థితి, మేధో పరమైన మందగింపు..ఇవన్నీ ఆ మాయదారి అల్జీమర్స్ లక్షణాలే. ఆ వ్యాధి ఒక విప్లవ ఋషిని పిచ్చి వాన్ని చేసింది. For More Interesting Videos and Updates Subscribe us @ https://goo.gl/HJENzp For More Info Reach us @ www.wakeupindia.tv ► Facebook :- https://goo.gl/UvYfd6 ► Twitter :- https://goo.gl/SA2AQj ► Google+ :-https://goo.gl/1rbKW8