У нас вы можете посмотреть бесплатно శ్రీమలహానికరేశ్వరుడు — శృంగేరిలో రామాయణమునాటి శివలింగము или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
శ్రీమలహానికరేశ్వరుడు విభాండకమహర్షి, ఋష్యశృంగమహర్షి, జగద్గురుశ్రీ ఆదిశంకరాచార్యుల ఆధ్యాత్మిక-అనుబంధము Other Language Versions: • Sri Malahanikareshwara Film (Please watch the film on a high-fidelity system or with a good pair of headphones for a full experience.) (headphones వాడండి) శ్రీమలహానికరేశ్వరస్వామివారి(పాపములను పోగొట్టు ఈశ్వరుడి) దేవాలయము కర్ణాటకలో శృంగేరిక్షేత్రములో, రామాయణమునాటి అతిపురాతనశివాలయము. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు ఆమ్నాయపీఠములలో ప్రథమము, ప్రధానము అయిన దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠమునకు నెలవైన క్షేత్రముగా శృంగేరి లోకప్రసిద్ధము. పురాణములలో కొనియాడబడిన శ్రీమలహానికరేశ్వరలింగమునకు ఈ శృంగేరీశారదాపీఠముయొక్క సంప్రదాయములో భగవత్పాదులు విశేషమైన స్థానమును నిర్దేశించారు. ఈ వృత్తచిత్రము శ్రీమలహానికరేశ్వరదేవాలయముయొక్క ఆవిర్భావమును, చరిత్రను, విశదపరుస్తుంది. మధురమైన సంస్కృతభాషలో శృంగేరీజగద్గురుశ్రీశ్రీ విధుశేఖరభారతీ సన్నిధానంవారు పురాణేతిహాసాదిశాస్త్రప్రమాణములతో, కశ్యపప్రజాపతిపుత్రులైన విభాండకమహర్షి ఈ లింగావిర్భావములో పోషించిన పాత్రను, శృంగేరీజగద్గురువులకు శ్రీమలహానికరేశ్వరునకు ఉన్న అనుబంధమును వివరించియున్నారు. దశరథమహారాజుకై పుత్రకామేష్టియాగమును జరిపించి, రామజననమునకు దారి వేసిన విభాండకమహర్షిపుత్రులు శ్రీ ఋష్యశృంగమహర్షికి ఈ లింగమునకు ఉన్న సంబంధము కూడ ఈ వృత్తచిత్రములో నిక్షిప్తమై ఉన్నది. ఈ దేవాలయముయొక్క చరిత్ర, ప్రాముఖ్యము, అభివృద్ధి, జగద్గురువులచే అనుష్ఠించబడెడి సాంప్రదాయికవిధివిధానములు మున్నగు అంశములు ఈ చిత్రములో చిత్రీకరించబడినవి. ఈ మలహానికరేశ్వరదేవాయమునకు శుభకృత్-మాఘకృష్ణసప్తమినాడు (12-2-2023) జరిగిన కుంభాభిషేకము మరియు రాజగోపురకుంభాభిషేకము సందర్భముగా ఈ వృత్తచిత్రము నిర్మించబడినది. అదే సమయములో భవానీదేవికి శిలామయగోపురము కూడ సమర్పించబడినది. OTHER LINKS 1. శృంగేరిజగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతీసన్నిధానంవారు విరచించిన శ్రీమలహానికరేశ్వరాష్టకము: • SRI MALAHANIKARESHWARA ASHTAKAM by Sringer...