У нас вы можете посмотреть бесплатно శ్రీకృష్ణదేవరాయలు కూడా యుద్ధం చేశారా? ఎందుకు? ఎవరితో? или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
1509 నుంచి 1530 వరకూ విజయనగర సింహాసనాన్ని శ్రీకృష్ణదేవరాయలు అధిష్ఠించాడు. ఆయన తుళువ వంశానికి చెందిన మహాపరాక్రమశాలి, ప్రభావశాలి అయిన రాజు. తన పాండిత్యం, సంభాషణ చతురతలతో ఆయన అందరినీ తనవారిగా చేసుకునేవాడు. అందుకే ఆయన మహాపండితులనుసైతం సమ్మోహితుల్ని చేయగలిగాడు. ఆయన ఏలుబడిలో తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత భాషలకు ప్రోత్సాహం లభించింది. ఆయన ఆస్థానంలో ఎనిమిదిమంది సుప్రసిద్ధ కవులుండేవారు. వారిని అష్టదిగ్గజాలుఅనేవారు. కృష్ణదేవరాయలు స్వయంగా మంచికవి. ఆయన వ్రాసిన ఆముక్తమాల్యడ తెలుగులో ఒక సుప్రసిద్ధ కావ్యం. పాండిత్యంతోపాటు శిల్పకళనుకూడా ఆయన పోషించాడు. విజయనగరంలోని విఖ్యాత రామమందిరాన్ని ఆయనే నిర్మింపజేశాడు. అంతేకాదు, ఆయన తన రాజ్యంలో వందలాది కోటలు, భవనాలు, మందిరాలు, గోపురాలు, మఠాలు, ధర్మశాలల్ని కట్టించాడు. ఆచరణలో సభ్యత, సంభాషణలో పటుత్వం, రాజకీయాల్లో విజ్ఞత, దూరదృష్టి, శత్రువుపట్ల కఠిన వైఖరివంటి గుణాలతో ఆయన వ్యక్తిత్వం అలరారుతుండేది. పాశ్చాత్య, తదితర విదేశీయాత్రికులుసైతం ముక్తకంఠంతో ఆయనను ఒక మహత్తరమైన, అనన్య సామాన్యుడైన శాసకునిగా అభివర్ణించారు. మహారాజు సజ్జనులను ఎంత గౌరవించి, వారి రక్షణకై పాటుపడేవాడో ధర్మశత్రువు లతో అంతే కఠినంగా వ్యవహరించేవాడు. పరాక్రమంతో పోరాడేవాడు. ఆదిల్షాహీతో జరిగిన నిర్ణాయకమైన యుద్ధంలో విజయం ఆయనను వరించింది. ఆ తరువాత ముస్లింల అహంకారాన్ని తుత్తునియలు చేసే షరతులు అంగీకరింపచేశాడు. ఆయన సైన్యంలో కూడా సువిశాలమైనది, శక్తివంతమైనది. ఆయన సైన్యంలో ఏడులక్షల కాల్బలం, పన్నెండువేల అశ్వికదళం, అయిదువందలయాభై ఒక్క ఏనుగులు నిరంతరం పోరుకి సన్నద్ధంగా ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు పాలనా కాలంలో విజయనగర రాజ్యవైభవం, సామర్థ్యం సర్వోచ్చదశకి చేరుకుంది. ఈ విషయం ఆయన రాజ్యాన్ని చూసేందుకు వచ్చిన విదేశీయాత్రికులువ్రాసిన వ్రాతలవలన తెలిసింది. ఆయన స్వరూపాన్ని గురించి కూడా భూరి ప్రశంసలుకురిపించారు. ఆయన రూపం చూడచక్కనిదై, చూసినవారిని ఇట్టే ఆకట్టుకునేదిగా,తేజస్సుతో అలరారేది. ఆయన స్వయంగా వైష్ణవుడే అయినా అన్ని మత సంప్రదాయాలపట్ల సహిష్ణుతతో వ్యవహరించాడు. హిందువులందరిలో ఏకాత్మత వెల్లివిరిసేలా చూసేవాడు. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన నాటినుంచే విద్యారణ్య, సాయణాదినేతలు సమత, సహిష్ణుతలను పెంచేవిధంగా రాజకీయాలను నిర్వహించారు. పర్యవసానంగా ప్రజానీకంలో స్వధర్మాభినివేశం, జాత్యభినివేశం ఒక సమైక్య భావనగా ముప్పిరిగొని, “మనమంతా హిందువులం" అన్న ధోరణి బలీయం అయ్యింది. విదేశీయాత్రికులు కూడా ఈ ధర్మసహిష్ణుత గురించి ఎంతో ఉత్సాహంతో వ్రాశారు. ఈ విదేశీయాత్రీకులు విజయనగరంలోని పౌర స్వాతంత్య్రం, ధార్మిక స్వాతంత్య్రం గురించి మాత్రమే కాక రాజుగారి వైభవం, ఆయన పరాక్రమం, ఆయన గౌరవం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు. ఉదాహరణకి పోర్చుగీస్ నుంచి వచ్చిన దువార్తె బార్వేస్ అనే యాత్రికుడు కొన్నాళ్ళు విజయనగరంలో నివసించాడు. ఆయన విజయనగరవైభవాన్ని కన్నులారా చూసి అచ్చెరువొందాడు. "విజయనగరవీధుల్లో ప్రపంచం వ్యాపారులు నలుమూలలనుంచి వచ్చి పోతున్నారు. వారు పూర్తి స్వాతంత్య్రంతో, ఆనందంగా వ్యాపారం చేసుకుంటున్నారు. నానాదేశాలు, ముఖ్యంగా పోర్చుగీసుసుతో కూడా పలువురు వచ్చారు. మూర్లవంటి విదేశీయులుకూడా నిర్భయంగా, అనుంచి వచ్చినచోట వ్యాపారం చేసుకుంటున్నారు. ఎలాంటి ఉపద్రవాల భయమూ లేదు. ఎవరు 3) ఎక్కడివారు, ఏ మత సంప్రదాయానికి చెందినవారు అన్నది పట్టించుకోకుండా, ప్రభువులు అందరికీ సమానంగా న్యాయం చేసేవారు. అందరినీ కాపాడేవారు" అని వ్రాశాడు. ఇరాన్రాజు పంపిన రాయబారి అబ్దుల్ రజాక్ "ఇలాంటి నగరం ప్రపంచమంతటా వెతికినా లభించదు" అని స్పష్టంగా పేర్కొన్నాడు. రాజప్రాసాదాన్ని అనుకునే ఇ) 38కినాడిక్యాలను అమ్మే నాలుగు వీధులు ఉన్నాయని, సాధారణ పౌరులు సైతం స్వభ చె). రత్నది ఆభరణాలచే అలంకృతులై ఉండేవారని విదేశీయాత్రికులు పేర్కొన్నారు. "విజయనగరం రోమ్ నగరంతో సమానంగా ఉండేది" అని పోర్చుగీసు యాత్రికుడు పోయెస్ వ్రాశాడు .