У нас вы можете посмотреть бесплатно హనుమంతుడు చెప్పిన 3 సూత్రాలు | Hanuman's Wisdom: Three Emotions, Three Messages | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
మన చరిత్ర మొత్తంలో బలవంతుడంటే హనుమంతుడు - సీతాదేవిని వెతకడానికి బయలుదేరి మహేంద్రగిరి పైనుండి వందయోజనాల సముద్రాన్ని అదేదో గోష్పదం అన్నట్లుగా అంటే ఆవు పాదం మోపినంత చిన్న ప్రదేశం అన్నట్లుగా ఒక్క ఉదుటన దూకేసినవాడు. అశోకవనాన్ని నాశనం చేసి, రావణకుమారుడైన అక్షకుమారుడితో సహా లక్షలాదిమంది రాక్షసుల్ని ఒక్కడిగా మట్టుబెట్టినవాడు. ఏ నగరం వైపు చూడాలంటే దేవతలంతా కూడా గజగజా వణికిపోతారో అటువంటి లంకాద్వీపాన్ని కాల్చి బూడిద చేసి, రావణాసురుణ్ణి హెచ్చరించి మరీ వచ్చినవాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధానికి రామలక్ష్మణులు సహా, సుగ్రీవాది వానరవీరులంతా మూర్ఛబోతే, యుద్ధరంగంలో ఒకే ఒక్కడుగా నిలిచి, కైలాసగిరి దగ్గర నుండి ఔషధాలున్న పర్వతాన్ని పెకలించుకు వచ్చి తనవారందరికీ ప్రాణదానం చేసిన ఘనుడు. అంతటి బలశాలి, పరాక్రమశాలి, వీరాధివీరుడు మన హనుమంతుడు. బలంలోనే కాదు, బుద్ధికుశలతలో కూడా ఆంజనేయుని మించినవారు ముల్లోకాల్లోను లేరు. ఈ విషయం సాక్షాత్తూ శ్రీరాముడే చెప్పాడు. రామలక్ష్మణులు కిష్కింధాప్రాంతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు వాళ్ళను చూసి బెదిరిపోయాడు. తనను చంపడానికి వచ్చిన వాలి మనుషులేమో అని కంగారుపడ్డాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవునికి ధైర్యం చెప్పి వాళ్ళెవరో కనుక్కోవడానికి ఒక భిక్షుకుని రూపంలో వెళ్ళాడు. రామలక్ష్మణులతో మృదువుగా సంభాషిస్తూ వివరాలను ఆరాతీశాడు. ఆంజనేయుని మాటతీరు చూసి రాముడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. వెంటనే తనప్రక్కనే ఉన్న లక్ష్మణుడితో “లక్ష్మణా! వేదాలన్నీ చదువుకున్నవాడు, వ్యాకరణాలన్నీ ఆపోసన పట్టినవాడు తప్ప వేరోకడు ఇలా మాట్లాడలేడు. అందంగా, క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా ఉన్న ఇతని మాటతీరు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతని మాటల్లో తొందరపాటు గాని, తొట్రుపాటు గానీ, ఉచ్ఛారణదోషాలుగాని మచ్చుకైనా లేవు. ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి ప్రతి మాటలోను తొణికిసలాడుతున్నాయి. ఇతని మాటతీరు ఎంత గొప్పగా ఉందంటే.. చంపడానికి కత్తి ఎత్తిన శత్రువు కూడా ఇతని మాటలను వింటే చాలు ముగ్ధుడైపోయి ఆ కత్తినిక దించవలసిందే. ఇతడు కార్యసాధకుడు. బుద్ధిమంతుడు. ఇతణ్ణి కొలువులో కలిగిన రాజు అదృష్టవంతుడు. ఇటువంటి ఉత్తమునితో స్నేహభావంతో మసలుకో. మధురంగా మాట్లాడు” అన్నాడు. అదీ ఆంజనేయుడంటే. అసలు రామాయణంలో ఒక కాండ మొత్తాన్నీ వాల్మీకి మహర్షి హనుమంతుని గురించే చెప్పారంటే, ఆ స్వామి గొప్పతనం ఎంతటిదో తెలుస్తోంది. సీతాదేవి దుఃఖాన్ని పోగొట్టినవాడు, లక్ష్మణునికి ప్రాణదానం చేసినవాడు, రాముని ఆలింగన భాగ్యాన్ని పొందివాడు, రామాయణ మహామాలా రత్నంగా కీర్తించబడేవాడు మన హనుమంతుడు. రామాయణంలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అది సాక్షాత్తూ కుండలినీ యోగమే అన్నది గుంటూరు శేషేంద్రశర్మగారి వంటి విజ్ఞులు చెప్పిన మాట. శ్రీరామచంద్రుడే పరమాత్మ, ఆ పరమాత్మనుండి దూరంగా తీసుకుపోబడిన జీవాత్మే సీతాదేవి. అలా వేరైన జీవాత్మను తిరిగి పరమాత్మతో అనుసంధానం చేసిన ఆచార్యుడే హనుమంతుడు. అటువంటి ఆచార్యుడైన ఆంజనేయుడు సుందరకాండలో మనోగతంగా అనుకున్న మూడు విషయాలు ప్రతి మనిషీ గుర్తుంచుకోదగ్గ జీవిత సూత్రాలు. వాల్మీకి మహర్షిద్వారా మనకందిన ఆ అమూల్యమైన మూడు సూత్రాలను ఈరోజు మనం చెప్పుకుందాం.