У нас вы можете посмотреть бесплатно ది:08/04/2025 రధోత్సవం | 2025 కళ్యాణమహోత్సవాలు | కోనసీమ తిరుమల - వాడపల్లి | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#balaji #devotional #konaseema #konaseematirumala #telugu #vadapalli #vadapallivenkanna #7weeks #aptemples #bhakthi #tirumala #trending శ్రీ స్వామి వారి మొక్కుబడులు E Hundi aptemples.ap.gov.in ఏడు శనివారములవెంకన్నదర్శనం - ఏడేడు జన్మల పుణ్యఫలం భారతదేశంలో ఎర్రచందనమనే కొయ్యలో వెలసిన ఏకైక స్వయంభు క్షేత్రం శ్రీ మచ్ఛన్ధన విగ్రహ విభవజుషాం పాపౌఘవిధ్వంసకం ధృత్వాయం భువివేంఞ్యటేశ్వర విభుర్నౌకాపురే భాసురః సర్వద్రోహకరాంస్తమౌ గుణ మయాంచ్ఛక్రాయుధే నాచిరా ద్ధుశ్రీకాన్విష భూరుహేణ సదృశాన్ధూరీ కరోతి స్వయమ్ క్షేత్ర పరిచయం: పెద్ద తిరుపతి, ద్వారకాతిరుమల తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి ప్రజలు మరో తిరుపతిగా భావించుకొని శ్రీ వేంకటేశ్వరుని సేవించుకునే క్షేత్రం వాడపల్లి గోదావరి నదీ పాయ అయిన గౌతమీ తీరంలో కొలువున్న ఈ స్వామిని దేవర్షి నారదుడే ప్రతిష్ఠింపచేశాడంటారు. పురాతన చరిత్రగల ఆలయాలలో ఇది ఒకటి. రాజమండ్రి సమీపంలో అఖండ గోదావరి రెండుపాయలుగా విడిపోతుంది. ఆ రెండు పాయలూ 100 కి..మీ.. దూరం ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ రెండు పాయలలో ఒకటి గౌతమి, రెండవది వశిష్ఠ. ఈ రెండింటి మధ్య నున్నదే కోనసీమ. కొబ్బరితొటలతో, పంటకాలువలతో కళకళ్ళాడుతూ కనిపించే కోనసీమ పేరు వింటేనే మండువేసవిలో సైతం మనసు చల్లబడుతుంది. రాజమండ్రికి 30కి..మీ దూరంలొ, రావులపాలెం కు 8 కి..మీ.. దూరంలొ, తూర్పుగోదావరిజిల్లా, ఆత్రేయపురం మండలంలో వున్న వాడపల్లి నేటికి ఆధునిక నాగరికత ఆనవాళ్ళు అంతగా కనిపించని, ఒకనాటి గ్రామసీమలను తలపునకు తెచ్చేగ్రామం. ఈ గ్రామంలో విశలమైన ఆవరణ కలిగి చుట్టూ ప్రాకారాలతో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రముఖంగా కనిపిస్తుంది. వాడపల్లి గ్రామాలు ఒకటికి మించి ఉన్నాయి కనుక యాత్రికులు ఇక్కడకు రావాలనుకుని మరో వాడపల్లికి వెళుతుంటారని , ఆ ప్రమాదాన్ని నివరించడనికే దీనిని చినవాడపల్లిగా లేదా లొల్ల వాడపల్లిగా పేర్కొంటూ ఉంటారు స్థల పురాణం ఒకసారి సనకానందనాది మహార్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై, అధర్మ జీవితం గడుపుతున్నరు. వారిని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు శ్రీ మహవిష్ణువును అర్చించారు. అప్పుడు శ్రీ మహవిష్ణువు ఈ విధముగా చెప్పెను. అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని కాని కలియుగంలో పాపభూయిష్టము ఎక్కువ అయివుంది. కొద్ది మాత్రమే పుణ్యాన్వితం. కావున కలియుగంలో అర్చా స్వరూపుడనై భూలోకమున లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలె దరిచేర్చునది అగు గౌతమి నది తీరమున నౌకపురమును ( వాడపల్లి ) పురమందు వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవహ మార్గంలొ నౌకపురమును ( వాడపల్లి ) చేరుకుంటాను. ఈ వృతాంత్తం అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. కొంతకాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవహంలో కోట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరా ఓడ్డుకు తీసుకువద్ధామని వెళ్ళినంతలో అదృశ్యమై పోవడం ప్రారంభించింది. ఒక రోజు గ్రామంలోని వృద్ధ బ్రహ్మాణులకు కలలో కనిపించి కలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు. కనుక మీరు వేకువనే గౌతమి స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌక లో నది గర్భంలోనికి వెళ్ళగా కృష్ణగరుడ వాలిన చోట చందన పేటిక లభిస్తుంది. దానిని ఒడ్డుకు తిసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు, చక్ర, గదలతో ఒప్పుతున్న స్వామి దివ్య మంగళ విగ్రహం కనిపించింది. అంతలో అక్కడకి దేవర్షి నారదుడు విచేస్తాడు. గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసినదిగా విష్ణువును ప్రార్ధించడం, విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని పురజనులకు చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు. తరువాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసినడు. "వేం" అంటే పాపాలను "కట" అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి వేంకటేశ్వరుడని నారదుడు స్వయంగా నామకరణం చేసి ప్రతిష్టింపచేసినాడు. వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్ట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతియేటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామి వారి తీర్థం , కళ్యాణోత్సవము వైభవముగా జరుగుతాయి. స్వామి వారి బ్రహోత్సవ, కళ్యాణొత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కనుల పండుగగా భక్తిప్రపత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శిస్తుంటారు.