У нас вы можете посмотреть бесплатно Sri Anaghastami Vratham Manasa Puja🌹_Sri Swamiji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
జయగురుదత్త.., Date 6/01/2020. ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా, ఉత్తర తిరుపతి... నిజామాబాద్ లో స్వయంగా అప్పాజీ ఈ వ్రత మానస పూజ ఆచరించి, భక్తులకు అనుగ్రహించారు. ఈ పాటనీ పరమపూజ్యా శ్రీ స్వామీజీ 25 సంత్సరాలక్రితం రచించారు. (అనఘావ్రత మానస పూజ) పల్లవి: అనఘమ్మా! అనఘయ్యా! అనఘుల మము చేయరయ్య! ధ్యానము : అరవిచ్చిన పూవులవలె సిరులి చ్చెడు కన్నులతో నెరి వెన్నెల నదులై తగు చిరునవ్వుల జిలుగులతో ఘనయోగ ద్యుతులీనెడు కనుబొమ్మల కూడలితో మాలాంబుజ వరదాభయ మహితములౌ కరములతో పద్మాసన సంస్థితిచే పైకెగసెడు పదరుచితో మాయక మా మది వెల్గెడు ఈ యనఘా దంపతులను మనసారగ ధ్యానించెద మది నిండుగ భావించెద ...1 పరివారదేవతా ధ్యానము : అణిమాఖ్యుండీశాన్యము నందున సేవించు చుండ ... లఘిమాఖ్యుండాగ్నేయా లంబనుడై కొల్చుచుండ ... ప్రాప్తిదేవు డా నైరృతి భాగమ్మున నిల్చియుండ ... ప్రాకామ్యుడు వాయుకోణ పాలకుడై కొల్వుదీర ... ఈ దక్షిణ భాగమ్మున ఈశిత్వుడు వెల్గులీన ... వామంబగు భాగంబున పరగి వశిత్వుండు మించ ... కామావ సాయిత్వా ఖ్యాతుడు వెన్వెనుక నిలువ ... మునుముందుగ మహిమాఖ్యుడు ఘనుడై పనులెల్ల దీర్ప ... అంబుజమున కొలువుండిన అనఘద్వయి నర్చించెద ...2 ఆవాహనము : అంతటనూ కొలువుండే అంతరాత్మ రూపులార! ఆవాహన మిదే చేతు ఆకారముతో రండో ...3 ఆసనము : ఆవాహితు లైనట్టి ఆది దంపతులారా! ఆదరమున నా మనసే ఆసనముగ అర్పించెద ...4 పాద్యము : ఇలలో జనులందరకూ ఇడుముల నెడ బాపగల్గు చరణాబ్జ ద్వంద్వములకు చల్లని పాద్యమ్ము లిత్తు ...5 అర్ఘ్యము : ఈడులేని సౌందర్యము నీను చుండు సొగసులతో ఈవి ముద్ర వెలయించెడు ఈ చేతుల కర్ఘ్యమిత్తు ...6 ఆచమనం : ఉదరములో కొలువుండిన పదునాలుగు లోకములు అల్లల్లన చల్లబడ ఆచమనం బిదే యిత్తు ...7 మధుపర్కం : ఊపున ఈ లోకమునకు మా పిలుపున వచ్చు మీరు పెనుబడలిక శాంతినొంద గొనుడీ మధుపర్కమయ్య ...8 పంచామృతస్నానం : ఋణ బంధముల దగిలి ఋజువర్తన వదలు మాకు పాపమ్ములు తొలగ మీకు పంచామృత స్నానమిత్తు ...9 స్నానం : రూఢిగ ఈ లోకమ్ములు మూడును పరిశుద్ధి బొంద చల చల్లని పన్నీటను జలకము లాడంగ రారె ...10 వస్త్రం : అలుగంగా వలదయ్యా నెలపొడుపుకు నూలుపోగు వలె ఇదిగో ఈ నూతన వల్కముల నర్పించెద ...11 ఉపవీతం : లూతా తంతుల బోలు నూతన యజ్ఞోపవీత మాంగల్య సూత్రములను మనసారగ అర్పించెద ...12 గంధం : ఎసగెడి సౌరభములతో దెసల గుబాళింప చేయు హరి చందన చర్చలను ఇరువురకూ అర్పించెద ...13 కుంకుమ : ఏపగు నును కాంతులతో చూపుల పండుగలు చేయు కుంకుమతో అక్షతలతొ పొంకపు తిలకమ్ము లిడుదు ...14 ఆభరణం : ఐశ్వర్యపు పరసీమల శాశ్వతతముగ కొలువు దీరు మీకిడు ఈ చిరుసొమ్ములు గైకోరే కరుణమీర ...15 పుష్పం : ఒయ్యారపు రేకులతో ఒప్పగు వాసనలతోడ సిరి మించే పలు రకముల విరిదండల నర్పించెద ...16 ధూపం : ఓదేవీ! ఓ దేవా! ఓంకృతి సంవేద్యులార ఈ సురభిళ1 ధూపమ్ముల మీ సేవకు అర్పించెద ...17 దీపం : ఔదార్యపు దీపు ్తలతో అందర వెలిగించుచుండు మీకిదిగో అర్పించెద చేకొనరే దీపమ్ముల ...18 నైవేద్యం : అందరనూ పోషించెడి ఆద్యులకానందమొప్ప సుమధుర నైవేద్యంబుల సమకూర్చెద భక్తితోడ ...19 తాంబూలం : అహమహమని పై కొనుచూ అహ ముడిగిన మునిజనులే దరిచేరే మీ కిదిగో తాంబూలం బర్పించెద ...20 హారతి : కర్పూర ఖండముల కమనీయ జ్వాలలతో ఆరని లో వెల్గులతో హారతు లెత్తెదను మీకు ...21 మంత్ర పుష్పం : చతురానన ముఖనిస్సృత చతుర్వేద వినుతులార! ఇదే మంత్ర పుష్పాంజలి నిడు చుంటిని కైకొనరే ...22 ప్రదక్షిణం : టక్కరినై చెడు నడతల చిక్కిన నా చెడుగు తొలగ చేకొని ప్రదక్షిణమ్ము మీకిదె గావింతు నిపుడు ...23 పునఃపూజ : తత్వార్థ స్ఫురణకునై సత్వావిష్కరణ కొరకు పూనికతో పునః పునః పూజల నర్పింతు మీకు ...24 క్షమాప్రార్థన : పనిగొని నే పాపమ్ముల పలుమరు గావించు చుంటి దేవా ! మీ సత్కరుణా సేవధియే నాకు రక్ష ...25 అర్పణ : యతివర సుర సంసేవ్యా యమనియమోపాస్య తత్త్వ పరమేశా నా చేసెడు ప్రతిపనియూ నీ కర్పణ ...26 ప్రార్థన : శత వాంఛా జ్వాలలలో శలభములై మాడు మమ్ము శ్రీ కరుణామృత ధామా చేకొని నైష్కామ్య మీవె ...27 ఫల సమర్పణ : క్షర మక్షర మను రెంటికి పరసీమలవెల్గుచుండు అద్వైతాత్మకులారా సద్విద్యా రూపులార! సోహమ్మను భావనచే నూహాగతి నీ మానస పూజావిధి మీ పాదాం భోరుహముల నర్పించితి అవ్యాజప్రేమాత్మకు లగు మీకిది తృప్తి గూర్చి అందించుత శ్రీ సచ్చిదా నందామృత సిద్ధిమాకు ...28 శ్రీ గురుదత్త.