У нас вы можете посмотреть бесплатно Sampoorna Sri Ramayanam - 2025 | Day 23 | Brahmasri Chaganti Koteswara Rao garu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025 l ఇరవై మూడవ రోజు (16-02-2025) కిష్కింధకాండ - రెండవ రోజు ప్రవచనము వాలిని సంహరించినప్పుడు శ్రీరాముడు ధర్మమును ఎక్కడా తప్ప లేదని, చనిపోవటానికి ముందు వాలి శ్రీరాముని అనేక ప్రశ్నలు అడగగా శ్రీరాముడు వాటన్నిటికీ సమాధానము చెప్తే, తన తప్పును తెలుసుకొని, ఒప్పుకుని, తనకు ఈ శిక్ష సమంజసమేనని, శ్రీరామునికి నమస్కరించి వాలి ప్రాణములను వదిలిపెట్టాడని పూజ్య గురుదేవులు "ప్రవచన సార్వభౌమ" బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా కిష్కిందకాండలోని వాలి వధ వృత్తాంతమును గూర్చి వారు ప్రవచనము చేశారు. ముందుగా దుందుభిని వాలి చంపివేసి అతడి శరీరమును గిరగిరా తిప్పి చాలా దూరం విసిరివేయగా రక్తపు చుక్కలు చిమ్ముతూ ఆ శరీరము మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడిపోయిందని, అందుకు ఆగ్రహించిన మతంగ మహర్షి అతడు ఆ ఆశ్రమమునకు ఒక యోజనము దూరము వరకు వస్తే అతని తల వ్రక్కలైపోయి మరణిస్తాడని శపించి, వాలి సహచరులు వచ్చినా వారందరూ శిలలుగా మారిపోతారని శపించటాన్ని, అందుచేతనే సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వత సమీపములో నివాసముంటున్నాను అని శ్రీరామునికి చెప్పిన వైనాన్ని శ్రీ గురువుగారు వివరించారు. అనితరసాధ్యమైన వాలి యొక్క బలము, పరాక్రమము, వేగము ఎంత గొప్పవో శ్రీరామునకు సుగ్రీవుడు పదేపదే వివరించి చెప్పి యుద్ధమునకు వెళ్లే ముందు ఇది తెలుసుకొనుట అత్యంత అవసరము అని చెప్పగా శ్రీరాముడు అవసరమైతే పరీక్షించుకోమని చెప్పుట, అక్కడపడి ఉన్న దుందుభి యొక్క శరీరమును రెండు వందల ధనుస్సుల దూరము విసిరివేయమని సుగ్రీవుడు అడుగగా, ఆ శరీరమును శ్రీరాముడు 20 యోజనములు దాటి విసివేయుట, అందుకు సంతోషించిన సుగ్రీవుడు వాలి యొక్క వేగం గురించి చెబుతూ అక్కడ ఉన్న ఏడు సాలవృక్షములో ఒక్కొక్కటి వాలి ముట్టుకోగానే ఆకులన్నీ రాల్చివేస్తాయని తెలియజేసి, ఒక్క సాల వృక్షమును బాణముతో కొట్టమని శ్రీరాముని అడగగా, శ్రీరాముడు సంధించిన బాణము లిప్తకాలములో ఏడు సార్లు వృక్షములను భంజించి, ఆ పైన ఉన్న పర్వత శిఖరమును పడవేసి, పాతాళ లోకం వరకు వెళ్లి తిరిగి వచ్చి శ్రీరాముని అమ్ముల పొదిలో చేరటమును చూచిన సుగ్రీవుడు శ్రీరాముని శరవేగమును, పరాక్రమమును తెలుసుకొని, అతని ఆభరణములు నేలకు తగిలేలా భూమి మీద పడి శ్రీరామునికి నమస్కరించి, వాలితో యుద్ధములకు బయలుదేరిన సంఘటన గూర్చి వారు వివరించారు. వాలితో సుగ్రీవుడు యుద్ధమునకు వెళ్ళగా శ్రీరామ లక్ష్మణులు ఇద్దరు చెట్టు చాటున నిలిచి ఆ యుద్ధమును చూచి, వాలిని చంపకపోవడం చేత తిరిగి వచ్చిన సుగ్రీవుడు వాలిని ఎందుకు చంపలేదు అని అడుగగా వాలి-సుగ్రీవులలో తనకు తేడా తెలియలేదని, పొరపాటున సుగ్రీవుని చంపేస్తానేమోనని బాణ ప్రయోగం చేయలేదని, ఇప్పుడు లక్ష్మణస్వామి ఇచ్చిన బంగారు కమలముల మాల వేసుకుని సుగ్రీవుడు యుద్ధమునకు వెళ్తే వాలి సుగ్రీవుల మధ్య తేడా తనకు తెలుస్తుందని, పైగా వాలి ఇప్పుడు దేవేంద్రుడు ఇచ్చిన గొప్ప బంగారు హారము వేసుకుని వచ్చేలా అతడిని కవ్వించమని సుగ్రీవునికి రాముడు చెప్పి పంపించిన వైనమును గూర్చి వారు వివరించారు. వాలితో తార మాట్లాడుతూ ఇప్పుడే పరాభవం పొందిన సుగ్రీవుడు తిరిగి మళ్ళీ వచ్చాడంటే అతడికి ఎవరి అండయో దొరికిందేమోనని, ధర్మాత్ముడు, పరాత్పరుడు అయిన శ్రీరాముడు సుగ్రీవునితో ఇప్పుడు మైత్రి చేసుకున్న సంగతి తాను తెలుసుకున్నానని, అందుచేత వాలి చాలా జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేసినా వినకుండా యుద్ధమునకు బయలుదేరిన వాలిని శ్రీరాముడు గుండెల్లో బాణము గుచ్చుకునేలా కొట్టి చంపి వేయుట గూర్చి శ్రీ గురువుగారు ప్రవచించారు. మరణమునకు ముందు వాలి శ్రీరాముడిని అధర్మాత్ముడిగా నిందించి, తన వైపు ఉండుంటే సీతమ్మను క్షణకాలములో ఇప్పించి ఉండేవాడినని, సుగ్రీవునితో ఎందుకు స్నేహము చేసుకున్నావని, ఈ విధముగా తనను ఎందుకు చంపావని కొన్ని వందల ప్రశ్నలు శ్రీరాముని పై సంధించగా పరమ దయామూర్తి, కరుణామయుడు అయిన శ్రీరాముడు ఎవ్వరైనా మరణించే ముందు తన మరణమునకు కారణమైన విషయమును తెలియజేయటం ధర్మము కనుక, అంత పాపము చేసినవాడైనప్పటికీ వాలి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగా, వాలి తన తప్పులన్నిటినీ తెలుసుకొని, తాను చేసిన మహా పాపముల చేత తాను అనుభవిస్తున్న ఈ మరణశిక్ష సమంజసమైనదేనని ఒప్పుకుని, ప్రాణములను విడిచిపెట్టిన సంఘటన గూర్చి శ్రీ గురువుగారు తెలియజేశారు. భరతుడు మనుష్యులనుకు రాజుగా వ్యవహరించగా తాను మృగములకు రాజుగా వ్యవహరిస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీరాముడు అరణ్యములో వానరులకు రాజైన వాలి అంత మహాపరాధము చేస్తే అతడిని సంహరించటము శ్రీరాముని యొక్క ధర్మమేనని, శ్రీరాముడు చేసిన ధనుష్ఠంకారమునకు పశుపక్షాదులు కూడా భీతిల్లిపోయాయని, పాము వచ్చి బుస కొడితే అది గమనించుకోకపోవడం మనిషి తప్పే తప్ప పాము తప్పు ఎట్లా కాదో అట్లాగే, ఆ ధనుష్ఠంకారమును గమనించకపోవడం ముమ్మాటికీ వాలి తప్పేనని, శ్రీరాముడు వాలిని వెనుక నుంచి కొట్టి ఉంటే అతడి వక్షస్థలములో బాణము గుచ్చుకునేది కాదని, శ్రీరాముని యొక్క శరవేగమును వాలి యొక్క వేగం కన్నా అంత గొప్పది కనుక శ్రీరాముడు వాలిని ఎదురు నుంచే కొట్టాడని, వాలి వధకు సంబంధించిన అనేక ధర్మ సూక్ష్మములను శ్రీరాముడు ఆవిష్కరించిన విధానమును గూర్చి శ్రీ గురువుగారు అభివర్ణించగా సభలో నివారందరూ మంత్రముగ్ధులయ్యారు. #SriChagantiVaani #SriChagantiPravachanamulu #ChagantiKoteswaraRaoGaru #Ramayanam #sampoornaramayanam #SampoornaRamayanam #ChagantiRamayanam #ChagantiLatestPravachanamulu #Ramayanam2025 #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #chagantikoteswararaogaru #chaganti #chagantiramayanam #vizag #visakhapatnam #2025