У нас вы можете посмотреть бесплатно రోజుకు 6 కోట్ల లీటర్లు మంచినీరు... ఉద్దానం కోసం ప్రత్యేకం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
రోజుకు 6 కోట్ల లీటర్లు మంచినీరు... ఉద్దానం కోసం ప్రత్యేకం #uddanam #drinkingwaterproject #andhrapradesh #meil భారత ప్రభుత్వం దేశ వ్యాపితంగా జల జీవన్ మిషన్ ను అత్యంత ప్రాధాన్యంగా అమలు చేస్తోంది. నీటి వనరులు సరిగ్గా లేని గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించటం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఈ పధకంలో ప్రతి గ్రామంలోను ప్రతి మనిషికి రోజుకు 50 లీటర్లు శుద్ధి చేసిన తాగు నీరు అందిస్తారు. ఆరు లక్షల జనాభా ఉన్న ఉద్దానం ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించిన రక్షిత తాగునీటి పధకంలో మనిషికి రోజుకు 100 లీటర్ల శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందిస్తారు. ఇందుకోసం నిర్మించిన వ్యవస్థ మొత్తం ఇప్పటికే పూర్తీ అయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రకారం చుస్తే రోజుకు మనిషికి 100 లీటర్ల చొప్పున 6 లక్షల మందికి మొత్తం 6 కోట్ల లీటర్ల నీరు అందుతుంది. ఏ లెక్కన చుసిన దేశ వ్యాపితంగా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మొత్తం నీటి సరఫరా రోజుకు మూడున్నర కోట్లకు మించలేదు. కానీ ఉద్దానంలో మాత్రం అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఇంత infrastructure నిర్మించారు. ఉద్దానం… తాగునీరే కాలకూట విషమై అక్కడి ప్రజల ప్రాణాలను కిడ్నీల జబ్బు రూపంలో కబలిస్తోంది. ప్రపంచంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్దానం కూడా ఉంది. నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, ఉద్దానం ప్రాంతాలు ఎక్కువ కిడ్నీ వ్యాధి గ్రస్తులతో ప్రపంచంలోనే తోలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సమస్యను రూపుమాపడానికి ఉద్దానంలో శాశ్వత తాగునీటి పధకాన్ని ఏర్పాటు చేయటం తో పాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్టుతో వీరందరూ సమస్య నుంచి గట్టెక్కనున్నారు. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున 30 ఏళ్ల కాలం పాటు తాగునీటి సరఫరా. ఉద్దానం కిడ్నీ సమస్యకు మెగా శాశ్వత తాగునీటి చికిత్స. ఆ ప్రాంతంలో నివసించేది దాదాపు 6 లక్షల మంది ప్రజలు. అయినా వారి కోసం ఓ ప్రత్యేక తాగునీటి పథకం. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా రూపొందించిన పథకం ఇది. ఎందుకో తెలుసా? కారణం ఏమిటంటే… అక్కడ దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్య గ్రామీణులను కబలించేస్తోంది. కిడ్నీ రోగాన్ని అంతమొందించేందుకే ఆ పరిమిత ప్రాంతానికి భారీ తాగునీటి పథకం. ఉద్దానంలో కిడ్నీ సమస్య 1985-86 ప్రాంతాల్లోనే బైట పడింది. 1990 దశకంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. ఈ ప్రాంతంలో రోజు రోజుకు కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సమస్యపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా భారీ తాగునీటి పథకాన్ని చేపట్టింది. ఉద్దానం ప్రాంతంలో బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవి సమయంలో ఎండిపోతున్నాయి. ఆ సమయంలో ప్రజలు బోరు నీటితో అవసరాలు తీర్చుకుంటున్నారు. బోరు నీరు తాగడం వలన వారు కిడ్నీ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆ ప్రాంతానికి నీటిని పైపులైన్ల ద్వారా తరళింపు. ఇందుకు 700 కోట్లతో మంచినీటి పనులు. హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీరు ఉద్దానం ప్రాంత ప్రజల కోసం కేటాయింపు. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటిలతో పాటు ఏడు మండలాల్లోని 809 ప్రాంతాలకు హిరమండలం రిజర్వాయర్ నుంచి నీరు. మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్హెడ్ ట్యాంకులకు…. ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. నీటిని తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్లు. రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరాయే లక్ష్యం. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున 30 ఏళ్ల కాలం పాటు తాగునీటి సరఫరా. మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్ నిర్మాణ0. ఇందులో భాగంగా 2 నియోజకవర్గాల పరిధిలో 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణ0.. హిరమండలం రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో పాటు మేర పైపులైన్ నిర్మాణ0.. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లోని ప్రాంతాలకు భవిష్యత్తులో తాగునీరందించేలా ఏర్పాట్లు. ఉద్దానం కిడ్నీ సమస్యకు మెగా శాశ్వత తాగునీటి చికిత్స. 7.82 లక్షల మందికి ప్రయోజనం Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.