У нас вы можете посмотреть бесплатно అద్భుతమైన శివస్తోత్రం | నయన రగడ | Nayana Ragada | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఈ "నయన రగడ", దీని వెనుకనున్న కథ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంకలనం చేసిన "చాటుపద్య మణిమంజరి" ప్రథమ భాగంలో ఉంది. వీరి రచనలు ఇప్పుడు కాపీరైటు పరిధిలో లేవు కనుక, మీరు ఆ పుస్తకాన్ని ebooks.tirumala.org నుండి కానీ archive.org నుండి దిగుమతి చేసుకోవచ్చును. అలానే andhrabharati.com లో దేశి అనే విభాగంలో రగడలు అనే ఉపవిభాగంలో ఈ నయన రగడ ఉంది. కాకపోతే వేటూరి ప్రభాకరశాస్త్రి గారి సంకలనంలోని రగడకు, ఆంధ్రభారతిలో ఉన్న రగడకు అక్కడక్కడా చిన్నపాటి భేదాలున్నాయి. అవి దోషాలుకావు, కేవలం ప్రతులలో ఉన్న తేడాలు మాత్రమే. చక్రపాణి రంగనాథుడనే వైష్ణవ కవి రచించిన అద్భుతమైన రచన ఈ నయన రగడ. ఈ రచన వెనుక ఒక కథ ఉంది. ఈ చక్రపాణి రంగనాథుడు శ్రీవైష్ణువుడు. మహా విష్ణుభక్తుడు. అయితే అంతే స్థాయిలో శివద్వేషి కూడా. ఒకసారీ రంగనాథుడి శివుడికంటే విష్ణువే గొప్పవాడన్న విషయం ఈ లోకానికి నిరూపించాలన్న బుద్ధి పుట్టింది. దానితో ఆ కాలంలో గొప్పిశివభక్తుడిగా, మహకవిగా పేరుపొందిన పాల్కురికి సోమనాథుడితో వాదానికి సిద్ధపడ్డాడు. ఎందరో పండితుల మధ్యలో వాదానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే చక్రపాణి రంగనాథుడికి ఎంత శివద్వేషం అంటే కనీసం శైవులని కూడా చూడడానికి ఇష్టపడేవాడు కాదు. దానితో సౌమ్యుడైన పాల్కురికి సోమన తెరచాటు నుండే వాదించడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో సోమన కొడుకైన చతుర్ముఖ బసవేశ్వరుడు, ఈ మాత్రం వాదానికి మా తండ్రి అంతటివాడెందుకు, నేను చాలు అంటూ తెరవెనుక నుండే ఆ రంగనాథునితో వాదించాడు. సుదీర్ఘంగా జరిగిన ఆ వాదంలో రంగనాథుడు ఓడిపోయాడు. అతడు సిగ్గుపడి. అక్కడనుండి తన శిష్యగణంతో సహా అహోబలం బయలుదేరాడు. తనంతటివాడికి ఇటువంటివంటి పరాజయం కలుగుతుందని అతడు ఊహించలేదు. దానితో అహోబిల నరసింహుని అర్చించి, ఉపాసన ప్రారంభించి, గొప్ప వాదనా శక్తి పొందాలనుకున్నాడు. అయితే అహోబిలానికి వెళ్లేదారిలో దూరంగా వారికి శ్రీశైల శిఖరం కనిపించింది. పొరపాటుగా అటుచూసి, వెంటనే కశ్శు మూసుకుని తలత్రిప్పేసుకున్నాడు. అంతే మరుక్షణం అతడి కన్నులు కనిపించకుండాపోయాయి. అతడు దుఃఖంతో అహోబిలం వెళ్లి నృసింహస్వామితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ స్వామి అతనికి ఆనాటి రాత్రి కలలో కనిపించి, శివవైష్ణవద్వేషం మానమని, శ్రీశైలం వెళ్ళమని సూచించాడు. పశ్చత్తాపంతో రంగనాథుడు తిరిగి శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించి, శిఖర దర్శనం చేశాడు. దానితో అతనికి తిరిగి చూపు వచ్చింది. అంతే పరమానందంతో ఆ రంగనాథుడు పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా కీర్తించాడు. ఆ సమయంలో సర్వం అతనికి శివమయంగానే కనిపించింది. సమస్త క్షేత్రాలు ఆ శ్రీశైల శిఖరంలోనే పొడచూపాయి. ఆ సమయంలో పట్టలేని ఆనందంతో ఆశువుగా అతని నోటినుండి వచ్చిన శివకీర్తనే ఈ నయన రగడ. రగడ అంటే అదొక ఛందస్సు. ఆటవెలది, తేటగీతి, ద్విపద ఎలానో రగడ కూడా అటువంటి ఒక ఛందోభేదం. నయనములు అంటే కళ్ళు వచ్చిన ఆనందంలో చేసిన రగడ కనుక ఇది నయన రగడ. ఈ రగడ ప్రారంభంలోనే రంగనాథుడు తన కథనంతా సంక్షిప్తంగా ఒక కంద పద్యంలో చెప్పి, ఆపై రగడ ప్రారంభించాడు. శ్రీ పార్వతీశుఁ జూడక - పాపాత్ముఁడ నగుచుఁ బోవఁ బథమునఁ జక్షుల్ - దీపించు దృష్టి తొలఁగిన - శ్రీపతి నడుగంగఁ గర్త శివుఁడని చెప్పెన్. నేను పాపాత్ముడనై శివుడిని చూడకూడదని అలా ముందుకు వెళ్లగానే, నాకు చూపు పోయింది. నేను శ్రీమహావిష్ణువును ప్రార్థించగా, ఆ స్వామి, అంతటకు కర్త అయిన ఆ పరమేశ్వరుడే నీ చూపు పోవడానికి కూడా కర్త. కనుక ఆ స్వామినే ప్రార్థించమన్నాడు. అని చెప్పి ఈ నయన రగడ ప్రారంభించాడు. స్వామి అనుగ్రహం పొందిన వెంటనే వచ్చిన మాటలు కావడం వల్ల ఈ రగడ అత్యంత పుణ్యప్రదమైందని, ఆరోగ్యాన్ని ప్రసాదించేదనీ చెబుతారు. ఇక ఆ రగడ చెప్పుకుందాం. రాజన్ పి.టి.ఎస్.కె