У нас вы можете посмотреть бесплатно #లేవీయకాండము или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
1అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా 2దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. 3దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును 4రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను. 5యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; 6అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను. 7పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకునిదగును. 8ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును. 9పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును. 10అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను. 11ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా 12వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను. 13ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. 14మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును. 15సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. 16అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను. 17మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చి వేయవలెను. 18ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును. 19అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని 20ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. 21ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును. 22మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 23నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. 24చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు. 25ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. 26మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. 27ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. 28మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను 29నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు యెహోవాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను. 30అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. 31యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును. 32సమాధాన బలిపశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను. 33అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును. 34ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను. 35వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య ములలోనుండినది అభిషేక మునుబట్టి అహరోనుకును అభి షేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను. 36వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. 37ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహారార్థబలినిగూర్చియు అపరాధ పరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి. 38ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను. లేవీయకాండము 7