Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб గుత్తిలో జనసేన నాయకుల విలేకరుల సమావేశం в хорошем качестве

గుత్తిలో జనసేన నాయకుల విలేకరుల సమావేశం 1 день назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



గుత్తిలో జనసేన నాయకుల విలేకరుల సమావేశం

గుత్తిలో జనసేన నాయకుల విలేకరుల సమావేశం. గుత్తి( న్యూస్) మార్చి 08 : రిపోర్టర్ కె యస్ కె సునీల్. గుత్తి పట్టణం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జనసేన నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గుత్తి పట్టణ, మండల జనసేన శ్రేణులు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త, సేవాతత్పరుడు అన్నింటికీ మించి మెగా కుటుంబానికి వీర విధేయుడైన వాసగిరి మణికంఠ మంచితనం గురించి నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ ఆయా కార్యక్రమాలు జయప్రదం చేయడానికి విశేష కృషి చేసిన ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదంతో గుంతకల్ నుండి వాసగిరి మణికంఠ కు జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు పార్టీ కష్ట కాలంలో పార్టీని గుంతకల్ నియోజకవర్గం లో చురుగ్గా ముందుకు తీసుకుని వెళ్ళినందుకు గాను 2024 నవంబర్ నెలలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ బాధ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన గుంతకల్ నియోజకవర్గంలోని కూటమి ఎమ్మెల్యే గెలుపునకు తన ఆరోగ్యం బాగా లేకపోయినా నిస్వార్థంగా కృషి చేసిన విధానాన్ని కూటమి నాయకులందరూ మెచ్చుకున్నారు... ఇలాంటి నిజాయితీ గల నాయకుడిని వైసిపి నాయకులు అహంకారి అని విమర్శించడన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం...కరోనా విపత్కర పరిస్థితుల్లో వాసగిరి మణికంఠ గుంతకల్ నియోజకవర్గం చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంకు ఇన్చార్జిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్న కరోనా ఆపన్నులకు అండగా నిలిచాడు. స్వతహాగా కూడా సేవాతత్పరుడైన వాసగిరి మణికంఠ పలు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎంతోమంది కార్యకర్తలకు, ఇబ్బందులలో ఉన్న వ్యక్తులకు తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయాలు చేస్తూ కోవిడ్ సమయంలో వందలాది మందికి అన్నదాన కార్యక్రమలు మరియు నిత్యావసర సరుకులు ఇప్పించడం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ వెంటిలేటర్ వితరణ గావించారు. కరోనా మొదటి వేవ్ లో తన మిత్రబృందంతో కలిసి ఎన్ ఎచ్.44 బైపాస్ పైన అన్నదాన శిబిరాలు నిర్వహించారు. మెగా హీరోల జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు నిర్వహించు అనేక రక్తదాన శిబిరంలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఎన్నో సార్లు రక్తదానం చేశారు. ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనా వాసగిరి మణికంఠ ని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు పిలిపించి మరీ ప్రత్యేకంగా అభినందించారు.ఇంతటి నిజాయితీ గల వ్యక్తి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని, పార్టీలు మారిన వారు మరియు వైసీపీ లోని కొందరు నాయకులు భవిష్యత్తులో వారి అవినీతి (భూకబ్జాలు, మట్టి మరియు ఇసుక దోపిడీలను) బాగోతాలు ఎక్కడ బయటకు తీస్తారు అన్న భయంతో విమర్శిస్తున్నారు అనేది మాకు అర్థం అయింది రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, మీ తాటాకు చప్పళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరని జనసేన శ్రేణులు వైసీపీ నాయకులను గట్టిగా హెచ్చరించారు.ఈ పాత్రికేయుల సమావేశంలో మండల అధ్యక్షుడు చిన్న వెంకటేష్, గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, పట్టణ ఉపాధ్యక్షులు వెంకటపతి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగయ్య రాయల్, మండల కార్యదర్శి మిద్దె ఓబులేష్, గద్దల కార్తీక్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, హేమంత్ రాయల్, గద్దల చంద్ర, ఊబిచర్ల రమేష్, బస్నేపల్లి రంగ, అఖండ భాష, గుజిరి రామంజి, ధనుంజయ, గండికోట వెంకటేష్, హరి, షేక్షా, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Comments