У нас вы можете посмотреть бесплатно శ్రీ లలితా సహస్రనామ భాష్యము అమ్మవారి 8వ నామం "రాగస్వరూప పాశాడ్య"|| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
నేటి నామ పారాయణ 8 వ నామం రాగ స్వరూప పాశాఢ్యా రాగరూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లికి నమస్కారము.. Ragha Swaroopa pasadya She who has loves rope in her left hand. salutations to the mother.... 8. రాగస్వరూపపాశాఢ్యా పరమేశ్వరి చతుర్చాహు సమన్విత. అంటే ఆమెకు నాలుగుబాహువులుంటాయి అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ బాహువులలో ఉండే ఆయుధాలను వివరిస్తున్నారు. మొట్టమొదటగా పాశము. రాగోల౭ నురక్తిః చిత్త వృత్తి విశేషః రాగము అంటే అనురాగము. ఇది మనోవ్యాపారవిశేషము లేదా కోరిక. ఒకరి మీద లేదా ఒక వస్తువు మీద ఉండేటటువంటి ఇష్టత. అదే ఆప్యాయత, అనురాగము, ఇష్టము, ప్రేమ ఈ రకంగా అనేక పేర్లతో పిలువబడుతుంది. అనురాగము అనేది పాశం వంటిది. కట్టిపడేస్తుంది. ఎవరిమీదనైనా ఇష్టత పెంచుకున్నట్ల ఐతే అది వారియందు బద్ధులను చేస్తుంది. దానివల్ల వారిని విడిచి ఉండలేము. వారిని చూడందే ఉండలేము. ఆ వస్తువు లేదా ఆ మనిషి లేకుండా మనం జీవించలేము అనిపిస్తుంది. దానికోసం మనం ఏపనైనా చేస్తాం. ఎంతకైనా తెగిస్తాం. ఈ రకంగా అనురాగం పెంచుకున్నవాడికి మనస్సు ఇతర విషయాలమీదకిపోదు. దైవచింతన గుర్తుకురాదు. అంతగా మోహంలో పడిపోతాడు. జడభరతుడి కథ ఇందుకు చక్కని ఉదాహరణ. పూర్వకాలంలో భరతుడు అని ఒకరాజుండేవాడు. చాలాకాలం రాజ్యం చేసిన తరువాత, రాజ్యాన్ని కుమారులకప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అతడు చాలాగొప్పవాడు. వేదవేదాంగవిదుడు. తపోనిష్టాగరిష్టుడు. ఒకరోజున స్నానం చెయ్యటానికి నదీతీరానికి వెళ్ళాడు. అక్కడ నిండుగర్భిణి అయిన లేడి ఒక పిల్లనుకని ప్రాణాలు విడిచింది. ఈ రాజర్షి ఆ లేడిపిల్లను తెచ్చి చాలా జాగ్రత్తగా పెంచసాగాడు. దానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాలుపట్టేవాడు. అది కూడా అతణ్ణి వదిలి ఎక్కడికీ వెళ్ళేదికాదు. ఈ రకంగా ఆ లేడిపిల్ల పెరిగి పెద్దదవుతున్నది. రాజుకు వయసు మీరుతున్నది. రాజుకు అవసానకాలం సమీపించింది. ఆఖరుస్థితిలో కూడా దైవచింతనలేదు. తను లేకపోతే ఈ లేడిపిల్ల ఏవిధంగా బ్రతుకుతుంది అన్న ఆలోచనే. ఎప్పుడూ అదే ఆలోచన. ఆ లేడిపిల్లను చూడకుండా క్షణం కూడా గడవని స్థితి. అలాగే కళ్ళు ముశాడు రాజు. పర్యవసానం ? మరుజన్మలో లేడిఅయిపుట్టాడు. ఆ లేడిమీద ఉన్న ప్రేమతో, వానప్రస్థానికి పోయినవాడు కూడా మళ్ళీ లేడిగా జన్మించవలసిన దుర్గతి పట్టింది. ఇదే రాగము. పరమేశ్వరి ఎడమచేతి వైపున గల పైచేతిలో ఈ పాశము ఉంటుంది. ఈ పాశము ప్రేమస్వరూపమయిన ఆయుధము. జీవిని కట్టపడేస్తుంది. మనోవృత్తులు బాధాకరమైనవి. అందుకే ఆయుధాలుగా చెప్పబడ్డాయి. రాగము అనేది అరిషడ్వర్గాలకు మూలమైనది. అనురాగాన్ని గనక జయించినటైతే ముక్తి లభిస్తుంది.సుషుప్తిలో రాగము ప్రాణమునందు లయం చెందుతుంది. జాగ్రదవస్థలో బుద్ది జాగ్రదమవుతుంది. అందుచేత అది మనసులోఉంటుంది. గాఢమైన సుపుప్తిలోను, లేదా తురీయావస్థలోను తప్ప అనురాగానికి అంతమనేది లేదు. ఇది అనంతమైనది. పూర్వజన్మలో తెలిసిన విషయాలను మాత్రమే జీవికోరతాడు. అంతేగాని తెలియని పదార్థాల జోలికిపోడు. ఎవరైనా కొత్తవ్యక్తులను చూసినప్పుడు వారిని ఎక్కడో చూసినట్లు, వారితో మనకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి వారితో మనకి ఏరకమైన పరిచయం లేదు. కాని గతజన్మలలో ఎప్పుడో వారితో బాగా పరిచయం ఉందన్నమాట. అందుకే మనకు అలా అనిపిస్తుంది. అందుచేతనే రాగోనురక్తిః చిత్త వృత్తి విశేషతః రాగము అనేది బుద్ధికి సంబంధించిన విషయము. చిత్తవృత్తి విశేషము. మాయలేదా అజ్ఞానము అనేవి ఇచ్చాజ్లాన క్రియాశక్తుల సమాహారము. ఈ మూడింటినీ విడదీయలేము. ప్రాపంచికమైన ఈ అనురాగాలను అరికట్టే పరమేశ్వరి శక్తియే పాశము. పైన చెప్పినటువంటి ఇచ్చాజ్డానక్రియాశక్తులలో జ్ఞానశక్తి ఎక్కువపాలుంటే - ఉత్తమజన్మ ఇచ్చా, క్రియాశక్తులపాలు ఎక్కువ ఉంటే పశుపక్ష్యాదుల జన్మ కలుగుతుంది. జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు బుషులు, గంధర్వులు, సిద్ధులుగ జన్మిస్తారు. సాధకుడు పరమేశ్వరిని అర్చించేటప్పుడు ఈ రాగము అనే దాన్ని పూర్తిగా వదిలివేసి, అంటే రాగాన్ని పరమేశ్వరికి అర్చించి, ఆవిడచేతిలో పాశరూపంలో ఉంచి అర్చించాలి. అప్పుడే అతడికి ముక్తి లభిస్తుంది. పరమేశ్వరి చేతిలో ఉన్నటువంటి పాశము వశీకరణము అని చెప్పబడుతోంది. ఈ పాశాన్ని అర్చించినవారు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతారు. అందుకే నవావరణ పూజ చేసేటప్పుడు ఎనిమిదవ ఆవరణ అనగా త్రికోణంలో ముందుగా దేవి యొక్క ఆయుధాలను అర్చించటం జరుగుతుంది. ఓంఐంహ్రీం శ్రీం హ్రీం ఆం సర్వవశీకరణా భ్యాం కామేశ్వరీ కామేశ్వర పాశాభ్యాం నమః పాశశక్తి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః దుర్వాసుడు తన శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లోని 43వ శ్లోకంలో పాశం ప్రపూరిత మహా సుమతి ప్రకాశో యో వా తవ త్రిపురసుందరి ! సున్దరీణాం ॥ ఆకర్షణేల ఖిలవశీకరణే ప్రవీణం చిత్తే దధాతి స జగత్రయవశ్యకృత్స్వాత్ ॥ ఓ తల్లీ ! సౌందర్యవంతులైన సుందరీమణులను ఆకర్షించగల, సకలదుష్టశక్తులను వశీకరించగల నీ పాశాయుధమును, పాశబీజమును ఉపాసించు వాడు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతాడు. 🌺శ్రీ మాత్రే నమః🌺 (వెంకటేశ్వర ప్రసాదు)