У нас вы можете посмотреть бесплатно Unlimited Breakfast For 100 Rs | Ravulapalem Rk Tiffins | Food Book или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#food #foodbook #ravulapalem వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన అనేక సంప్రదాయ ఉపాహారాలతోపాటు ఆరోగ్య అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు రకాల మేలుకర అల్పాహారాలు తయారు చేసి అందిస్తున్న రావులపాలెం RK టిఫిన్స్ కు వెళ్లడం జరిగింది.ఇడ్లీ పిండితోనే పొట్టిక్క తయారు చేస్తారు. కాకపోతే పనస ఆకులో ఉంచి సిద్ధం చేస్తారు.కావున పనస ఆకు సారం పిండికి చేరడంతో ఇడ్లీ రుచికి ఆమడ దూరంలో ఉంటుంది.తింటున్నప్పుడు ముద్దగా మెత్తగా మెసులుకుంటూ తృప్తినందిస్తుంది.దిబ్బ రొట్టె చెరుకు పానకం తినడం ఇదే ప్రధమం.అంతక మునుపు ప్రసార మాధ్యమాలలో చూసి ఆసక్తికరంగా అనిపించింది. కనుక కార్యక్రమం చిత్రీకరణ సమయంలో వివిధ అల్పాహారాలు నా ముందు ఉన్న నా దృష్టి అంత రొట్టె పానకం పైనే ఉంది.మొత్తంగా నా ఆహార విహారంలో నాకు బాగా నచ్చిన ఆహారంలో ముఖ్యమైనది ఇక్కడ లభించే దిబ్బ రొట్టె చెరుకు పానకం.తినడం తర్వాత రొట్టెను చూస్తేనే మైమరిపిస్తోంది.ఇక ఓ ముక్క అలా తొంచి పానకంలో ముంచి నోటికిఇస్తే ఆహా ఆ రుచి అద్బుతం అనడంలో అతిశయోక్తి లేదు.చెరుకు పానకంతో రొట్టె మరి మృదువై రేణువులుగా స్పర్శిస్తూ పానకం పుట్టతేనెను తలపిస్తూ అనుభూతి మదిని తాకుతుంది.పెసరట్టు నడుమ ఉల్లిపాయలు యింపుగా తగలగా పచ్చి మిరపకాయ తన కారం రవ్వంత ఇవ్వగా జీలకర్ర, అల్లం వగైరా ఇతర ముడి పదార్థాలు తమ స్వభావాలను కొద్ది,కొద్దిగా పంచగా అందినది రుచి పుష్కలంగా.మెలకల వడ కరకరలాడుతూ మేలైన రుచిగలది.ఇన్ని పదార్థాలలో ఈ వక్కటి చాలు ఆకలి తిరడానికి అన్న విధంగా ఉంది ఆవిరి కుడుము. తేలిక స్వభావంతో హాయి గా ఉంది తింటే.గారే మరియు పెసర పునుగు నూనె జాడలేకుండా బావున్నాయి.సాధారణంగా ఉప్మా ఇష్టం లేని వారు సైతం ఇక్కడ లభించే జీడీ పప్పు ఉప్మా తింటే ఇష్టత వ్యక్తం చేస్తారు.విటమిన్ ఇడ్లీది విలక్షణమైన రుచి.10 రకాల ఉపాహారాలు ఆరు పచ్చడులతో ఎంత తిన్న 100 రూపాయిలు. నేను ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాలు క్రితం చిత్రీకరణ జరిపాను అప్పుడు ధర 80 రూపాయిలు. గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.