У нас вы можете посмотреть бесплатно అతి మూత్ర వ్యాధి సమస్యను నివారించే(కసివింద పెంట చెన్నంగి )ఔషధ మూలికా|Cassia Sophera Tree Benefits или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అతి మూత్ర వ్యాధి సమస్యను నివారించే(కసివింద పెంట చెన్నంగి )ఔషధ మూలికా|Cassia Sophera Tree Benefits #athimutravydhinivarana #Occidentalis #kasivindhatree #chennamgimulika #chennamgiplant #plantchennamgi #ayurvedamtelugu #natuvydhyamatimutravydhi #manduluayurvedam #ayurvedamtelugu #teluguayurvedam #healthtips #healthybenefits #villagetrees #viral #sudhakarbolla కసివింద :- కాసమర్ధ- Cassia Sophera C. Occidentalis;. గుణసంజ్ఞా- కాసారి: దగ్గును కొట్టునది. కసివింద చెట్టు యొక గజమెత్తు వరకును బెఱుగును. ఆకులు మూడంగుళముల పొడవు గలిగి రెండంగుళముల వెడల్పు గలిగి మిరపకాయలను బోలియుండును. దీనికాయలు ఉలవకాయల యాకృతిని బోలి సన్నముగా నైదారంగుళముల పొడవుగ నుండును. దీని పూవులు పసుపుపచ్చ రంగు గలిగి యుండును. ఆంధ్రదేశము నందంతటను పెరుగును. కొన్ని స్థలములలో అడవిగా పెరుగును. వేరు, ఆకులు, గింజలు, పూవులును గూడ యుపయుక్తమైనవిగా నున్నవి. గుణములు :- మిక్కిలి చేదు రుచియు, కొంచెము తీపిరుచియు గలిగి యుండును. కఫమును, వాతమును కొట్టును. మిక్కిలి అతిశయముగా పైత్యమును శమింపజేయును. పచనకారి, కంఠమును శోధించును. ఉష్ణవీర్యము గలది. విపాకమున కారపు రుచిగ మారును. అజీర్ణమును, దగ్గులను హరించును. మెత్తమున నిది త్రిదోషహర ద్రవ్యము. శ్వాసలకును, ఎక్కిళ్ళకును - కసివిందాకు కషాయము లోని కిచ్చి ఎక్కిళ్ళు, శ్వాస రోగములు శమించును. దీని నిజరసమును దీసి సేవించిన దగ్గులు కట్టును. తామర, కిటిభమను కుష్టుకు :- కసివింద వేరును, సౌవీరమును కలిపి నూరి పైన లేపనము జేసిన దద్రులు, కిటిభమను కుష్ఠుము హరించును. తేలు విషమునకు :- కసివింద వేరు నోటిలో పెట్టుకుని కొంచెము నమిలి తేలుకుట్టిన వాని చెవిలో నూదిన తేలు విషము దిగును. (చక్రదత్త) వాతజశ్లీపదము (బోదకాలునకు) :- కసివింద వేరు ముద్దగా నూరి ఆవునేతితో కలిపి త్రాగిన త్వరలో శ్లీపదము తగ్గును. (వంగసేన). (గ్రామ్య ప్రయో). నేత్రరోగములకు :- కసివిందాకులు ఆముదమున వెచ్చజేసి కంటికి కట్టిన కంటిబాధలు తగ్గును. ఆకుల రసము కంటిలో వేసిన కొంచెము మండును. కండ్లకలక, దురదలు తగ్గును. గజ్జికి :- ఆకుల రసము వంటికి పూసినచో చిడుములు తగ్గును. గాయములకు :- పసుపును, కసివిందాకును మెత్తగా నూరి గాయముల పైన వేసి కట్టుకట్టిన మానును. తేనెలో ఆకు రసమును, పటికి పంచదార పొడియు కలిపి నాకిన కళ్లి దగ్గులు కట్టును. తామరకు :- నిమ్మపండ్ల రసముతో వేరు అరగదీసి తామరకు రాసిన పోవును. అతిమూత్రమునకు :- :- కసివింద విత్తులను, కాసర విత్తులను మెత్తగా నూరి పాలలో కలిపి త్రాగిన అతిమూత్రము కట్టును. వాత నొప్పులకు :- 4 లీటర్ల కసివిందాకు రసము, ఒక లీటరు దిగువాయి నూనెయు కలిపి నూనె మిగులనటులు కాచి, వాత నొప్పులకును, పక్షవాత నొప్పులకును రాసిన శమించును. కసివింద కాయలకూర :- లేతగానుండు కసివిందకాయల కూర వండుకొని తినిన శ్వాసకాసలు హరించును. వాతము శమించును. ఆకుల కూరకు గూడ నీ @manavillageideas by sudhakar bolla cel:9177945318