У нас вы можете посмотреть бесплатно Grand canyon of India-Gandikota | The best historical and tourism place in Kadapa | Into The Nature или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#gandikota #gandikotafort #kadapa #tourism #గండికోట_రహస్యం #aptourism #intothenature గండికోట రహస్యం కొండ దుర్గాలు, నదీ దుర్గాలు, మైదాన దుర్గాల్లో గండికోటది ప్రత్యేకం. కొండ, నది రెండూ సహజ రక్షకాలు. గండికోట స్వయం ప్రతిపత్తి కలిగిన సామ్రాజ్యం కాకపోయినా తన హొయసల, విజయనగరం, బహమనీ, గోల్కొండ నవాబుల వరకూ తన ప్రత్యేకతను నిలుపుకుంది. గోల్కొండ ప్రతినిథి మీర్ జుమ్లా గండికోటను ఆక్రమించాలని ఇప్పుడున్న మైలవరం డ్యాం ప్రాంతంలో మూడు నెలలు వేచి చూశాడంట. ఎదురుగా జయించడం కుదరక మాయోపాయంతో పొదిలె లింగన్న అనే అధికారిని లోబరుచుకుని, గుత్తికోట ఇస్తామని సంధికి ఒప్పించి, కోటలోకి అడుగుపెట్టాక పెమ్మసాని తిమ్మనాయుడిని, అతని కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచి అందరినీ చంపించాడంట. అంత దుర్భేద్యమైనది గండికోట. కోట ప్రాకారాలు, ప్రధాన ద్వారాలు, రాళ్ల నిర్మాణాలను ఒక్కొక్కటి ప్రత్యేకంగా పట్టి పట్టి చూస్తే కానీ అర్థమవ్వవవి. చార్మినార్, కారాగారం, ధనాగారం, జుమ్మా మసీద్ వంటివెన్నో చూడదగ్గవున్నాయి. గండికోట రంగనాథ స్వామి ఆలయం, నిర్మాణం ఎన్నెన్నో సినిమాల్లో చూసుంటాం. గోపిచంద్ సాహసంతో మొదలు, రాఘవ లారెన్స్ కౌబాయ్, సాహో, భారతీయుడు - 2, ఈమధ్య పొలిమేర - 2, చాలా ఉన్నాయి. వాటిల్లో చూపించినట్టే ఎంతో అద్భుతమైన నిర్మాణ శైలి దానిది. ఒక్కో శిల్పాన్ని పట్టి పట్టి చూడాలి. కోట లోపల నిమ్మ తోటలు, రేగి చెట్లు వనంలా ఉన్నాయి. కోట పడమటి వైపు రహస్య మార్గముందంటే చూడ్డానికి అటుగా వెళ్లాము. కోట ప్రాకారం వెంబడి నడుస్తుంటే అదొక అద్భుత అనుభూతి. రాజ్యం, సంరక్షణ పక్కనపెడితే అక్కడ పహారా కాసే సైనికులు ఎంత అద్భుతమైన ప్రకృతి అనుభూతులు పొంది వుంటారూ..! అలంగీర్ బురుజునుంచి చూస్తే ఉదయం మేం నడిచిన కాన్యన్, గండికోట డ్యాం, ఎర్రమల కొండలు మరింత అబ్బురంగా కనిపిస్తున్నాయి. కోట ప్రాకారం కిందనే రాయల చెరువు నించొచ్చి పెన్నా నదిలో కలిసే వంక ఉంది. రహస్య మార్గముండేది అక్కడే. మీర్ జుమ్లా చిన్న తిమ్మనాయున్ని మోసం చేసి, అతని కుటుంబాన్ని చంపినప్పుడు చాకలతను తిమ్మనాయుని కొడుకును తప్పించి, తమిళనాడు వైపు పారిపొయింది ఇదే దారినుంచి ఉండొచ్చు. అలంగీర్ బురుజు మీదనుంచి కదలాలనిపించలేదు ఎంతసేపైనా. అక్కడో వింత పరిస్థితి. ఫోటో కోసం చివరి అంచున నిలబడ్డానా, లోయలోకి జారిపోతున్న ఆలోచనలు చుట్టుముట్టాయి. మనసును నియంత్రించుకుంటూ, అది బాడీ లాంగ్వేజ్ లో కనపడకుండా ఫోటోకి ఫోజులివ్వడం ఒక ఆర్టు. బాగానే మేనేజ్ చేశా అనిపించింది ఫోటోలు చూశాక. తమిళనాడు ఆరుమంది యాత్రికులు వస్తుంటే బురుజు దగ్గర ప్రభాకరన్న తమిళంలో మాట కలిపాడు. తర్వాత నేనూ అందుకున్నా. వాళ్లను తీసుకొచ్చింది యాభైకి పైన వయసుండే ఉండే మునిస్వామి గారు. The Forgotten Empire, మరికొన్ని చరిత్ర పుస్తకాలు చదివి ఇటుగా వచ్చాడంట. ఇంతకుముందు రెండుసార్లు వచ్చాడు. గండికోట చూసుకుని హంపి వెళ్తామన్నారు. సిద్ధవటం కోట, నందలూరు సౌమ్యనాథ ఆలయం, గుత్తికోట గురించి చెప్పాను. ఈసారి తప్పకుండా చూస్తా అన్నాడు. పెరుమాల్ మురుగన్ గారి అర్థనారి గురించి కాసేపు చర్చ జరిగింది. ఆర్కాట్ ప్రాంతపు (చిత్తూరు, తమిళనాడు) గ్రామీణ సంస్కృతి దగ్గరుండి చూడమన్నా, చదవడమన్నా నాకు ఆసక్తి. అదే ఆయనతో చెప్తే తమళినాడు రండి నేను చూపిస్తా అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. వీలు చూసుకుని వెళ్లిరావాలి. యాత్రికుల తాకిడి ఎక్కువవ్వడం, ప్లాస్టిక్ నియంత్రణ, వాడకం పట్ల నిర్వహకులు అవగాహన కల్పించలేకపోతుండడంతో ఎటుచూసినా ప్లాస్టిక్ మరియు చెత్త. అదంతా చూసి NoPlasticLankamala లాగా NoPlasticGandikota కూడా మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. జనవరిలో చెయ్యాలి. Location:- https://maps.app.goo.gl/ucoK6GuwpacXY...