У нас вы можете посмотреть бесплатно *వెంకటగిరి: శిరిడీ సాయి లేఔట్‌లో ఘనంగా గౌరమ్మ సంబరాలు ధనుర్మాసం నాటిన హిందూ సంప్రదాయాలకు పునర్జీవనం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు శిరిడీ సాయి లేఔట్‌లో గౌరమ్మ సంబరాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిరోజూ సాయంత్రం లేఔట్‌లోని మహిళలు ఒకే చోటకు చేరి హిందూ సంప్రదాయ కళలను గుర్తు చేసే విధంగా గౌరమ్మ పాటలు, కోలాటాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాలు లేఔట్ అంతటా భక్తి భావాన్ని వెల్లివిరియజేయడమే కాకుండా, సంప్రదాయాల పట్ల అవగాహనను మరింత పెంపొందించాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గౌరమ్మ పాటలు ఆలపించడం, కోలాటాలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మహిళా మణులు మాట్లాడుతూ, హిందూ సంప్రదాయాలను ఆచరించడం ద్వారా మన సంస్కృతీ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయగలమని తెలిపారు. ఈ సంప్రదాయ కళలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు, శరీరానికి మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా ధనుర్మాసంలో వాతావరణ మార్పులతో చలి ఎక్కువగా ఉండే సమయంలో ఈ విధమైన సాంప్రదాయ కార్యక్రమాలు శరీరాన్ని చురుకుగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడతాయని వివరించారు. మన సంప్రదాయ కళల్లో సైన్స్ దాగి ఉందని పేర్కొంటూ, పెద్దలు ఆచరించిన ప్రతి సంప్రదాయానికి ఆరోగ్యపరమైన, సామాజికపరమైన ప్రాముఖ్యత ఉందని మహిళలు స్పష్టం చేశారు. గౌరమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజూ ఒకే చోట కలుసుకోవడం వల్ల లేఔట్ వాసుల మధ్య స్నేహభావం మరింత బలపడిందని, పరస్పర పరిచయాలు పెరిగాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.