У нас вы можете посмотреть бесплатно వికలాంగుల పింఛన్లలో నిబంధనలు కచ్చితంగా అమలు – స్పీకర్ అయ్యన్నపాత్రుడు || V NEWS || NARSIPATNAM || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
నర్సీపట్నం, ఆగస్టు 20 ::: గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి అనర్హులైన వికలాంగుల పింఛన్లపై స్పందించారు. అర్హత లేకపోయినా ఇప్పటివరకు వికలాంగుల పింఛను పొందిన వారితో పాటు వారికి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మంది వరకు అనర్హులైన వికలాంగులు గుర్తించబడ్డారని చెప్పారు. ఈ అంశంపై రెండు నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి తాను లేఖ రాసినట్టు వివరించారు. నిబంధనల ప్రకారం 40 శాతం పైగా వైకల్యం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని, 40 శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తారని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 4,148 మంది వికలాంగులలో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారిని గుర్తించారని, అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపికచేసినట్టు తెలిపారు. అలాగే 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా, 3,349 మంది అనర్హులైన వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. వీరిలో అర్హత ఉన్న అనర్హులుగా ఉన్నవారు తాజాగా వైద్యుల ధృవపత్రం తీసుకుని తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. రద్దైన పింఛన్లపై ప్రభుత్వం నెలకు రూ. 2.94 కోట్లు, ఏటా రూ. 35.28 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 742 మందిని అనర్హులుగా గుర్తించగా, వారిలో 8 మందికి ఆరోగ్య పింఛన్లు, 114 మందికి వృద్ధాప్య పింఛన్లు మంజూరుచేసి, 670 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేశామని ఆయన వివరించారు. వీరందరికీ నెలకు రూ. 40.20 లక్షలు, ఏటా రూ. 4.82 కోట్లు, ఐదేళ్లకు రూ. 124 కోట్లు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని స్పీకర్ గారు పేర్కొన్నారు. అర్హత ఉన్న అనర్హులుగా గుర్తించిన వారు ఈ నెల 25వ తేదీ లోపు వైద్యుల ధృవపత్రాలు సమర్పించుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. అర్హత లేకపోయినా గత ఐదేళ్లుగా ప్రభుత్వ నిధులను వాడుకున్నారని, వారికి సర్టిఫికేట్లు జారీ చేసిన వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు తెలిపారు. జారీ : PRO To Hon’ble Speaker జెట్టి శంకర్ రావు local news in telugu,vnews,voice of public,poltical news DAILY NEWS PAPERS UPDATES || enadu | andhrajyothi | sakshi V NEWS NARSIPATNAM's broadcast DISCLAIMER : Some contents are used for educational purposes under "fair use". Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. ... Non-profit, educational or personal use tips the balance in favor of fair use. ꧂Thankyou ꧂ #VNEWSAP @VNEWSAP #narsipatnam #narsipatnamnews #ayyannapathrudu #vijaychinthakayala #