У нас вы можете посмотреть бесплатно Sampoorna Sri Ramayanam - 2025 | Day 5 | Brahmasri Chaganti Koteswara Rao garu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025 ఐదవ రోజు (29-1-2025) | బాలకాండ - ఐదవ రోజు ప్రవచనము మనిషికి ఎప్పుడూ ఉత్సాహము ఉండాలని, ఆ ఉత్సాహమే సత్ఫలితములకు కారణమవుతుందని, ముఖ్యముగా విద్యార్థులకు ఎంతో ఉత్సాహము ఉండాలని, చదువుకునేటప్పుడు చదువు యందు పూజ చేసేటప్పుడు పూజ యందు, ఆ విధముగా చేసే పని యందు సంతోషము, ఉత్సాహమున్నవారి విజయములు సాధించగలుగుతారని గురువుగారు వివరించారు. కానీ ఉత్సాహమునకు అత్యుత్సాహమునకు చాలా తేడా ఉందని, పెద్దలపట్ల తారతమ్యమెరుగక అత్యుత్సాహముతో ప్రవర్తించటము అత్యంత ప్రమాదకరమని, మహానుభావుడైన కపిల మహర్షి పట్ల అటువంటి అత్యుత్సాహముతో ప్రవర్తించటం వలనే సగరులందరూ బూడిద కుప్పలు అయిపోయారని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు. 42 రోజులపాటు సాగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచన మహా యజ్ఞములో భాగముగా ఐదవ రోజున బాలకాండలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు చెప్పిన గంగావతరణ ఘట్టమును గూర్చి వారు ప్రవచనం చేశారు. తప్పు చేసినవాడు సొంత కుమారుడే అయినా అది ఉపేక్షింపక సమాజ హితము కొరకు సగర చక్రవర్తి ప్రవర్తించారనీ, స్వప్రయోజనముల కన్నా సమాజ ప్రయోజనము కొరకు ఆలోచించటం ఏ తరమునకైనా పాలకులకు ఆదర్శప్రాయమైన విషయమని శ్రీరామాయణం మనకు నేర్పిస్తుందని వారు తెలియజేశారు. తన వంశములో ఎక్కడో మూడు తరాలకు ముందున్న పెద్దలను ఉద్ధరించుట కొరకు వయసులో ఉన్న భగీరధుడు రాజ్యమును, భోగములను త్యాగము చేసి అంత గొప్ప తపస్సు ఆచరించాడని, అందుచేతనే ఆయన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారని, ఆయన చేసిన ప్రయత్నమును ఇప్పటికీ భగీరథ ప్రయత్నం గా కీర్తిస్తామని గురువుగారు అభివర్ణించారు. సనాతన ధర్మములో మనని పెంచి పెద్ద చేసిన మన పితృ పితామహుల పట్ల భక్తితో ఉండటం అత్యంత ప్రధానమైన విషయమని, వారు శరీరం వదిలిన తర్వాత కూడా వారికి శ్రద్ధదో శ్రార్థమును పెట్టటము అత్యంత ప్రధానమైన విషయమని గురువుగారు వివరించారు. పాలకుల నుండి ప్రజల వరకు సమాజంలో ఉన్న అందరికీ శ్రీరామాయణం ప్రవర్తనను నేర్పిస్తుందని, ఇటువంటి ఇతిహాసములు మనకు ఎప్పటికీ నడవడి విషయంలో కరదీపికలేనని వారు కొనియాడారు. గంగావతరణం అనేక మలుపులతో కూడుకున్న మహత్తరమైన ఘట్టమని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్పర్శ కలిగిన గంగ పరమ పావనమైన నది అని, గంగను కేవలం స్మరించటము చేతనే పాపములు నశిస్తాయని, ఈ గంగావతరణ ఘట్టమునకు వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఈ ఘట్టమును విన్నవారి పితృదేవతలు కూడా ఎంతో సంతోషిస్తారని చెప్పారని గురువు గారు తెలియజేశారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం తర్వాత వచ్చిన మొదటి అమావాస్య నాడు సంపూర్ణ శ్రీరామాయణాంతర్గతముగా పితృదేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైన గంగావతరణం ఘట్టము రావటము కేవలం గంగమ్మ మరియు సీతారాముల అనుగ్రహముని పూజ్య గురువుగారు తమ హర్షం వ్యక్తం చేశారు పరమ పవిత్రమైన గంగావతరణ ఘట్టము యొక్క ప్రవచనము జరిగిన సందర్భముగా గంగాజలములను తెప్పించి, ప్రత్యేకమైన కలశలో ఉంచి, శివ పార్వతుల తో పాటు వేదిక పై అలంకరించి, ఆ గంగాజలములకు మంగళనీరాజనాలు సమర్పించి, సభలోని వారందరికీ ఆ గంగాజలములను ప్రోక్షణ చేశారు. #SriChagantiVaani #SriChagantiPravachanamulu #ChagantiKoteswaraRaoGaru #Ramayanam #sampoornaramayanam #SampoornaRamayanam #ChagantiRamayanam #ChagantiLatestPravachanamulu #Ramayanam2025 #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #chagantikoteswararaogaru #chaganti #chagantiramayanam #vizag #visakhapatnam #2025