У нас вы можете посмотреть бесплатно Sampoorna Sri Ramayanam - 2025 | Day 4 | Brahmasri Chaganti Koteswara Rao garu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025 నాల్గవ రోజు (28-1-2025) | బాలకాండ - నాల్గవ రోజు ప్రవచనము ఓర్పు అనేది అత్యంత ప్రధానమైన గుణమని, ఓర్పులోనే జగత్తు అంతా ఉన్నదని, ఓర్పుయే దానము ఓర్పుయే సత్యము ఓర్పుయే దైవమని శ్రీరామాయణం మనకి తెలియజేస్తుంది అని బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించారు. సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా నాల్గవ రోజు (28-01-2025) వారు శ్రీరామాయణం బాలకాండలోని విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు తెలియజేసిన కుశనాభ ఉపాఖ్యానము, విశ్వామిత్రుని యొక్క వంశ చరిత్ర మరియు షణ్ముఖోత్పత్తి ఘట్టాములపై ప్రవచనము చేశారు. ఈ జాతిలో పిల్లల యొక్క వివాహములు నిర్ణయించే అధికారం కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కలదని, అట్లా కాకుండా పిల్లలు పెద్దలను ధిక్కరించి తమ వివాహములను తామే నిర్ణయించి చేసుకునే దుస్థితి ఈ జాతికి ఎన్నడూ రాకూడదని రామాయణము కోరుతుందని వారు తెలియజేశారు. మెదడులోకి మంచి ఆలోచనలు వచ్చి చేతులతో మంచి కార్యములు చేయించగలిగిన సమర్ధులు కేవలము గురువేనని, అందుచేతనే అటువంటి చేతులను జోడించి అహంకారము లేదా బుద్ధి అనబడే తలను ఆ చేతులకు తాటించి నమస్కరించటం సంప్రదాయమని నమస్కారము యొక్క వైభవమును గూర్చి పూజ్య గురువుగారు తెలియజేశారు. విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు అనేక మంచి విషయములు చెప్తూ ఎంతటి కష్టమైన విషయమునైనా ఓర్పుతో సాధించవచ్చని, సత్పురుషులకు ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పుయేనని నేర్పించారని, అటువంటి గొప్ప విషయములను శ్రీ రామనకు నేర్పించి శ్రీరాముని సుగుణాభిరామునిగా చెక్కిన వారు గురువైన విశ్వామిత్రుడిని కొనియాడారు. అట్లాగే శ్రీరామాయణంలోని విశ్వామిత్ర మహర్షి యొక్క వంశ చరిత్రలో విశ్వామిత్రునకు, ఆయన అక్క గారికి ఉన్న అనుబంధము మానవీయ సంబంధములకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని, శ్రీరామాయణమును బాగా చదువుకుని అర్థం చేసుకున్న వారికి అన్నదమ్ములు అక్కచెల్లెళ్లతో ఎట్లా ప్రవర్తించాలో బాగా తెలుస్తుందని ప్రవచించారు. రామాయణ భారతాది ఇతిహాసములు కేవలం కథలు కాదని, మన నిజ జీవితంలో మనకి విలువలు మరియు మానవీయ సంబంధాలు నేర్పే గొప్ప పాఠములని వారు అభివర్ణించారు. శ్రీ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి అందించిన షణ్ముఖోత్పత్తి అత్యంత శక్తివంతమైన ఘట్టమని, వాల్మీకి మహర్షి ఆ ఘట్టమునకు ప్రత్యేకముగా ఫలశ్రుతి కూడా చెప్పారని గురువు గారు తెలియజేశారు. షణ్ముఖోత్పత్తిలో వాల్మీకి మహర్షి వాడిన కుమారసంభవం అన్నమాటనే కాళిదాస మహాకవి కూడా వాడుకున్నారని, ఈ ఘట్టం గర్భిణీ స్త్రీలకు అత్యంత ఉపయుక్తమైనదని, సంతాన కారకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ ఘటమును వినటము లేదా చదువుకోవటం వల్ల ఎటువంటి గర్భ దోషములు లేకుండా సత్సంతానము కలుగుతుందని, దానికి అనేక దృష్టాంతములు ఉన్నాయని వారు వివరించారు. సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా అత్యంత శక్తివంతమైన షణ్ముఖోత్పత్తి ప్రవచనము జరిగిన సందర్భముగా ఈరోజు ఆరుగురు కృత్తికల స్వరూపముగా ఆరుగురు సువాసినిలు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు కలిపిన ఆవుపాలను మేళతాళములతో తీసుకువచ్చి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నైవేద్యముగా సమర్పించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన మంగళనీరాజనాలు సమర్పించి, ఆ తీర్తమును, స్వామివారికి పూజ చేసిన విభూది ప్రసాదమును భక్తులందరికీ అందించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహము చేత ఈ దేశములో సంతాన విషయములో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఆరోగ్యవంతమైన సత్సంతానమును పొంది, గొప్ప శీలవంతులైన పిల్లలు తయారవ్వాలని పూజ్య గురువు గారు అభిలాషించారు. #SriChagantiVaani #SriChagantiPravachanamulu #ChagantiKoteswaraRaoGaru #Ramayanam #sampoornaramayanam #SampoornaRamayanam #ChagantiRamayanam #ChagantiLatestPravachanamulu #Ramayanam2025 #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #chagantikoteswararaogaru #chaganti #chagantiramayanam #vizag #visakhapatnam #2025