У нас вы можете посмотреть бесплатно మహా పండితుడు చెప్పిన పిల్లల కథ | సీతాఫలం | Veturi Prabhakara Sastry | Seethaphalamu | Rajan PTSK или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఒక మహా సాహితీవేత్త రచించిన ఒక చిన్ననాటి ముచ్చటను చెప్పుకుందాం. మనం మహా అన్న విశేషణాన్ని అందరికీ వాడలేం. కొందరికేమో వాడకుండా ఉండలేం. వారి స్థాయి అలాంటిది మరి. బసవపురాణం, ఉద్భటారాధ్య చరిత్ర, ఆంధ్రకామందకము వంటి ఎన్నో ఉథ్గ్రంథాలను పరిష్కరించి తన పీఠికలతో వాటిని ప్రచురింపజేసినవారు, వినుకొండ వల్లభరాయకృతముగా చెప్పుకునే క్రీడాభిరామం శ్రీనాథుని రచనే అని అనేక ఆధారాలు చూపించి పండితులను ఒప్పించి మెప్పించినవారు, కందుకూరి రుద్రకవి కృష్ణదేవరాయల భువనవిజయంలో ఈశాన్యపీఠాన్ని అధిరోహించిన అష్టదిగ్గజములలో ఒకడని నిరూపించినవారు, అమరావతీ శాసనములలో “నాగబు” అనే తెలుగు పదముందన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి తెలుగుభాష ప్రాచీనతను లోకానికి వెల్లడి చేసినవారు, తెలుగు భాషకు ప్రాచీనహోదా రావడానికి ఒక కారణమైనవారు, శతాబ్దాలుగా జానపదుల నోళ్ళలో నానుతున్న అనేక బాలల గేయాలను, కూనలమ్మ పదాలను ఒకచోట చేర్చి “బాలభాష”గా మనకు అందించినవారు, పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల గురించి, మరుగునపడి ఉన్న ఆయన సంకీర్తనల గురించి పరిశోధించి, ఆయన రచనలను పరిష్కరించి లోకానికి తెలియజెప్పినవారు, భృక్త రహిత తారక రాజయోగమనే మాస్టర్ CVV యోగమార్గాన్ని అవలంబించి, ఎందరో దీర్ఘరోగులకు, వ్యాధులు నయం చేసినవారు, కులమతభేదములు చూపని మానవతావాదిగా జీవిత పర్యంతం నడుచుకున్నవారు, శతావధాని అయినప్పటికీ అటుగా అడుగులు వెయ్యడానికి పెద్దగా ఇష్టపడక, శాసన పరిష్కర్తగా, భాషాసాహిత్యాల పరిశోధకుడిగా, తన జీవితాన్ని తెలుగుభారతికి అంకింతం చేసినవారు, కవులు, రచయితలు ఏ పత్రికలో తమ రచన పడితే పిహె.డి పట్టా పొందినంత సంబరాన్ని పొందేవారో ఆ “భారతి” పత్రిక తొట్టతొలి సంచికను, “శివకవులు” అనే తన వ్యాసంతో ప్రారంభించినవారు, మహాపండితుడు, కవి, భాషాశాసనసాహిత్య పరిశోధకుడు, యోగిపుంగవుడు అయిన ఆ మహోన్నత ప్రతిభాశాలి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. ఆయన తన చిన్ననాటి చేష్టలను గుర్తుచేసుకుంటూ రచించిన ఓ గేయ కథే ఈ సీతాఫలము. ప్రభాకరశాస్త్రిగారు చాలా చిన్నకుర్రాడిగా ఉన్నప్పడు వారు తిన్నటువంటి ఓ సీతాఫలం చుట్టూ తిరిగేదే ఈ కథ. అప్పటి విషయాన్ని గేయఫణితిలో, పద్యాల రూపంలో ఎంతో అందంగా మనకందించారాయన. ఏడెనిమిదేళ్ళ బాలుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, ఈ రచనా శైలీ కూడా అలానే ఉంటుంది.